Movie News

శభాష్ ధనుష్.. నాగ్‌ను పిలిస్తే అతనెళ్లాడు

‘కుబేర’ సినిమాలో హీరో ధనుషా, నాగార్జుననా అంటూ రెండు రోజులుగా వాళ్లిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటుంటే.. ఇరు వర్గాలకూ బుద్ధి చెప్పేలా వ్యవహరించారు ఆ ఇద్దరు హీరోలు. ‘కుబేర’ సక్సెస్ మీట్లో ఇటు నాగ్, అటు ధనుష్ ఎంతో హుందాగా వ్యవహరించి.. అనవసరంగా ఫ్యాన్ వార్స్ చేస్తున్న అభిమానుల నోళ్లకు తాళాలు వేసేశారు. మొన్నటి ప్రెస్ మీట్లో ఈ కథ విన్నపుడు తనే హీరో అనిపించిందని నాగ్ చెబితే.. దాన్ని మరోలా అర్థం చేసుకుని గొడవ చేశారు ధనుష్ ఫ్యాన్స్. రిలీజ్‌కు ముందు దర్శకుడే హీరో అని చెప్పి, హిట్టయ్యాక తనే హీరో అంటూ క్రెడిట్ తీసుకుంటున్నాడంటూ నాగ్ మీద విమర్శలు చేశారు. కానీ నాగ్ దీనిపై సక్సెస్ సెలబ్రేషన్లలో క్లారిటీ ఇచ్చాడు.

ఈ చిత్రానికి సినిమాలోని పాత్రలే హీరోలని చెబుతూ.. అందరికీ మించి దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా తన మీద నెగెటివ్‌గా మీమ్స్ వేసిన, వార్తలు రాసిన వాళ్లందరి గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. నాగ్ మాట్లాడ్డానికి ముందే ధనుష్ తనదైన శైలిలో వ్యవహరించి శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి వేడుకల్లో ముఖ్య అతిథి కంటే ముందు.. చివరగా హీరో మాట్లాడ్డం ఆనవాయితీ. ‘కుబేర’ హీరో ధనుషే అన్న ఉద్దేశంతో యాంకర్ ముందు నాగార్జునను ప్రసంగం కోసం స్టేజ్ మీదికి పిలిచారు. ఐతే ధనుష్ నాగ్‌ను ఆపి.. వేగంగా స్టేజ్ మీదికి వెళ్లిపోయాడు.

ఆయన కంటే ముందు నేను మాట్లాడాలి.. తర్వాత సార్ మాట్లాడాలి అంటూ నాగ్‌కు తగిన గౌరవాన్నిచ్చాడు. హీరో ఎవరన్నది అప్రస్తుతం, సీనియర్‌గా నాగ్‌ను గౌరవించాలని ధనుష్ భావించి ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ధనుష్ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న వారికి తనదైన శైలిలో బదులిచ్చాడని చెప్పొచ్చు. మరోవైపు ఈ వేడుకకు అతిథిగా వచ్చిన చిరు గురించి మాట్లాడుతూ.. ఏ పని చేసినా ఓం రాసినట్లు, సినిమాల విషయంలో చిరు పేరు తలుచుకుంటామంటూ గొప్ప కామెంట్ చేశాడు.

This post was last modified on June 23, 2025 12:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

18 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago