Movie News

ట్రెండ్ భ్రమలను బద్దలు కొట్టిన ధనుష్

నెలరోజలుగా ప్రత్యక్ష నరకం చూస్తున్న థియేటర్లకు ఊపిరి పోసిన సినిమాగా ఇప్పుడు ఎక్కడ చూసినా కుబేర గురించిన చర్చే జరుగుతోంది. హిట్టు గురించి టీమ్ ముందు నుంచి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చినా రిజల్ట్ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం చాలా మంది ఊహించలేదు. అందుకే శేఖర్ కమ్ముల బృందం ఆనందం అంతా ఇంతా కాదు. దాన్ని షేర్ చేసుకోవడానికి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ ముఖ్యఅతిథిగా విచ్చేయడం విశేషం. కొంత ఆలస్యంగా వచ్చిన ధనుష్ వేదికవద్దకు చేరుకోగానే చిరంజీవికి పాదాభివందనం చేయడం అందరిని ఆకట్టుకుంది.

తన ప్రసంగంలో ధనుష్ ఒక ముఖ్యమైన పాయింట్ పంచుకున్నాడు. ఇప్పటి ట్రెండ్ లో ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే యాక్షన్లు, ఎలివేషన్లు, రక్తపాతాలు తప్పనిసరనే భ్రమలో చాలా మంది ఉన్నారని, కానీ శేఖర్ కమ్ముల దాన్ని కుబేరతో తప్పని నిరూపించారని, భావోద్వేగం కన్నా బలమైన గ్రాండియర్ ఇంకేముంటుందని వివరించాడు. అంతే కాదు ఇటీవలే కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన టూరిస్ట్ ఫ్యామిలీని గుర్తు చేస్తూ ఒక సింపుల్ స్టోరీని గొప్పగా తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని కదిలించిందని అన్నారు. కుబేరకు పని చేసిన వాళ్లందరికీ థాంక్స్ చెప్పిన ధనుష్ అన్నీ పేర్లను మళ్ళీ ప్రస్తావించలేదు.

మరో ఆకట్టుకున్న అంశం ఏంటంటే యాంకర్ ముందు నాగార్జునని స్పీచ్ కోసం పిలవగా ధనుష్ వారించి తాను ముందు మాట్లాడతానని చెప్పడం పెద్దల పట్ల గౌరవాన్ని మరోసారి  తేటతెల్లం చేసింది. ఈవెంట్ ఆద్యంతం చాలా హుషారుగా సంతోషంగా కనిపించిన ధనుష్ ఇంత హ్యాపీగా ఉండటంలో కారణముంది. తమిళం కన్నా ఎక్కువగా తెలుగులోనే కుబేరకు భారీ స్పందన కనిపిస్తోంది. చెన్నై కన్నా వేగంగా హైదరాబాద్ బుకింగ్స్ పరుగులు పెడుతున్నాయి. సార్ తో తోలి టాలీవుడ్ స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ మూడేళ్లు తిరక్కుండానే ఇప్పుడు కుబేర రూపంలో మరో ఘనవిజయం అందుకోవడం విశేషం.

This post was last modified on June 22, 2025 10:13 pm

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

14 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago