నెలరోజలుగా ప్రత్యక్ష నరకం చూస్తున్న థియేటర్లకు ఊపిరి పోసిన సినిమాగా ఇప్పుడు ఎక్కడ చూసినా కుబేర గురించిన చర్చే జరుగుతోంది. హిట్టు గురించి టీమ్ ముందు నుంచి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చినా రిజల్ట్ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం చాలా మంది ఊహించలేదు. అందుకే శేఖర్ కమ్ముల బృందం ఆనందం అంతా ఇంతా కాదు. దాన్ని షేర్ చేసుకోవడానికి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ ముఖ్యఅతిథిగా విచ్చేయడం విశేషం. కొంత ఆలస్యంగా వచ్చిన ధనుష్ వేదికవద్దకు చేరుకోగానే చిరంజీవికి పాదాభివందనం చేయడం అందరిని ఆకట్టుకుంది.
తన ప్రసంగంలో ధనుష్ ఒక ముఖ్యమైన పాయింట్ పంచుకున్నాడు. ఇప్పటి ట్రెండ్ లో ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే యాక్షన్లు, ఎలివేషన్లు, రక్తపాతాలు తప్పనిసరనే భ్రమలో చాలా మంది ఉన్నారని, కానీ శేఖర్ కమ్ముల దాన్ని కుబేరతో తప్పని నిరూపించారని, భావోద్వేగం కన్నా బలమైన గ్రాండియర్ ఇంకేముంటుందని వివరించాడు. అంతే కాదు ఇటీవలే కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన టూరిస్ట్ ఫ్యామిలీని గుర్తు చేస్తూ ఒక సింపుల్ స్టోరీని గొప్పగా తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని కదిలించిందని అన్నారు. కుబేరకు పని చేసిన వాళ్లందరికీ థాంక్స్ చెప్పిన ధనుష్ అన్నీ పేర్లను మళ్ళీ ప్రస్తావించలేదు.
మరో ఆకట్టుకున్న అంశం ఏంటంటే యాంకర్ ముందు నాగార్జునని స్పీచ్ కోసం పిలవగా ధనుష్ వారించి తాను ముందు మాట్లాడతానని చెప్పడం పెద్దల పట్ల గౌరవాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. ఈవెంట్ ఆద్యంతం చాలా హుషారుగా సంతోషంగా కనిపించిన ధనుష్ ఇంత హ్యాపీగా ఉండటంలో కారణముంది. తమిళం కన్నా ఎక్కువగా తెలుగులోనే కుబేరకు భారీ స్పందన కనిపిస్తోంది. చెన్నై కన్నా వేగంగా హైదరాబాద్ బుకింగ్స్ పరుగులు పెడుతున్నాయి. సార్ తో తోలి టాలీవుడ్ స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ మూడేళ్లు తిరక్కుండానే ఇప్పుడు కుబేర రూపంలో మరో ఘనవిజయం అందుకోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates