మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాల్లోకి వచ్చారు. చిరు రక్త సంబంధీకులే కాక.. ఆయన చిన్న కూతురిని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి ఎంటరైన కళ్యాణ్ దేవ్ సైతం హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటిే ‘విజేత’ అనే సినిమా చేశాడు. దాని తర్వాత ‘సూపర్ మచ్చి’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశాడు.
తొలి సినిమా నిరాశ పరిచినా.. రెండో సినిమా ఇంకా విడుదలే కాకున్నా.. కళ్యాణ్ అప్పుడే మూడో సినిమా మొదలుపెట్టేయడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అశ్వథ్థామ’తో దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడెవరు అన్న దాని కంటే నిర్మాత ఎవరన్నది ఆసక్తి రేకెత్తించే విషయం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత దగ్గరైన మిత్రుల్లో ఒకడైన రామ్ తాళ్ళూరి చిరు చిన్నల్లుడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇండస్ట్రీయలిస్ట్ అయిన రామ్.. పవన్ రాజకీయ పార్టీ జనసేనకు ముందు నుంచి ఫండింగ్ చేస్తుండటంతో పాటు తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బేనర్ పెట్టి చుట్టాలబ్బాయ్, నేల టిక్కెట్టు, డిస్కో రాజా సినిమాలను నిర్మించారు. వాటిలో ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు. ‘డిస్కో రాజా’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి కళ్యాణ్ దేవ్‌తో చిన్న సినిమాను లైన్లో పెట్టాడు.
గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్నందిస్తుండగా.. దేశ్ రాజ్ అనే కొత్త రచయిత దీనికి కథ అందించాడు.
This post was last modified on November 12, 2020 3:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…
సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి…
తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…