ఎంత వద్దనుకున్నా కొన్ని క్లాష్ లు తప్పేలా లేవు. మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ గా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన హరిహర వీరమల్లు, కింగ్ డమ్ పరస్పరం తలపడే పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమా జూలై 24 లాక్ చేసుకుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రావొచ్చని అంటున్నారు. ఇంతకు ముందు జూలై 18 అన్నారు కానీ అమెజాన్ ప్రైమ్ షెడ్యూల్స్ ప్రకారం ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఘాటీ ఉండటంతో సదరు కంపెనీ సూచన మేరకు వారం ఆలస్యంగా రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఇదే సమస్య కింగ్ డమ్ కూడా ఎదురుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం మేరకు జూలై 25 తప్ప వేరే ఆప్షన్ కనిపించకపోవడంతో దాన్నే ఖరారు చేసుకుని త్వరలోనే ఒక అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా దీన్ని అఫీషియల్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి సితార సంస్థ పవన్ తో ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టేందుకు ఇష్టపడదు. పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చెప్పారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారి పోతుండటంతో తప్పని పరిస్థితుల్లో రిస్క్ అనిపించినా సరే ముందుకు వెళ్లాలని డెసిషన్ తీసుకున్నట్టు అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
పూర్తి క్లారిటీ ఏ నిమిషంలో అయినా వచ్చేయొచ్చు. పోస్ట్ పోన్ పర్వంలో మునిగి తేలిన ఈ రెండు సినిమాలకు ఒకే రకమైన పరిస్థితి రావడం విచిత్రమే. దీని గురించి ఇండస్ట్రీలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రమంగా థియేటర్ రిలీజ్ డేట్లను ఓటిటిలు ఇంతగా ప్రభావితం చేయడం మంచి పరిణామం కాదనే అభిప్రాయం సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఈ రెండు సినిమాలే కాదు ఇతర పెద్ద హీరోల చిత్రాలకు సైతం ఇలాంటి సంకట స్థితి రావడం ఒక రకంగా డేంజర్ బెల్ లాంటిది. ఇకపై అగ్రిమెంట్లు చేసుకునే టైంలోనే ఎలాంటి డెడ్ లైన్లు లేకుండా రాసుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరికేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates