ది రాజా సాబ్ టీజర్ అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చేసింది. సోషల్ మీడియాలో అధిక శాతం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుండగా విఎఫ్ఎక్స్ మీద కామెంట్స్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా దర్శకుడు మారుతీ నుంచి ఆశించిన దానికన్నా బెటర్ అవుట్ ఫుట్ కనిపించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు కొంత నెగటివిటీ వచ్చింది. హిట్టు దర్శకులు వెంటపడుతుంటే ప్లాప్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్కెఎన్ అన్నట్టు ఇవన్నీ దాదాపు తీరినట్టేనని చెప్పొచ్చు. రిలీజ్ ఇంకా దూరం ఉంది కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇదిలా ఉండగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ ది రాజా సాబ్ మూడున్నర గంటలు ఉంటుందని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హాలీవుడ్ కు ఈ సినిమా తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఇంత నిడివి అక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూసుకోవాలనే రీతిలో సంకేతం ఇచ్చాడు. డిస్నీ లాంటి మూవీస్ మనమూ తీయగలమని రాజా సాబ్ నిరూపిస్తుందని అన్నారు. తర్వాత మళ్ళీ క్లారిటీ ఇస్తూ అదేదో ఫ్లోలో అన్నానని రాజా సాబ్ మూడు గంటలే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. సో ఓవర్ లెన్త్ ఆందోళన లేనట్టే.
అయినా కంటెంట్ బాగుంటే ఎంతసేపు థియేటర్ లో కూర్చున్నామనేది ప్రేక్షకులు లెక్కచేయలేరని పుష్ప 2 నిరూపించింది. కాకపోతే రాజా సాబ్ హారర్ కామెడీ డ్రామా. యాక్షన్ ఎలిమెంట్స్, పాటలు, ఇతర అంశాలు ఎన్ని ఉన్నా దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో మరీ ఎక్కువ కంటెంట్ ఉంటే అనుమానాలు రావడం సహజం. కానీ టాలీవుడ్ ఆడియన్స్ కు ఆ బెంగ అక్కర్లేదు. బొమ్మ నచ్చితే ఇవేవి పట్టించుకోరు. అయితే ఇంకా ఫైనల్ వెర్షన్ లాక్ చేయలేదు కాబట్టి అప్పుడే దీని గురించి నిర్ధారణగా చెప్పలేం కానీ రాజా సాబ్ కు సంబంధించి పార్ట్ 2 ఉండదని, బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయమని మారుతీ చెప్పడం గమనార్షం.
Gulte Telugu Telugu Political and Movie News Updates