హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ టీమ్ స్పందించడం మానేసింది. జూన్ 12 పోస్ట్ పోన్ అప్డేట్, అది కూడా చాలా ఆలస్యంగా ఇవ్వడం తప్ప ఇంకెలాంటి మూమెంట్ లేదు, జూలై 18 రిలీజవుతుందని ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు కానీ నిజంగా వస్తుందా రాదానేది అంతు చిక్కడం లేదు. సిజి వర్క్ అయిపోయింది. ఫైనల్ కాపీ పనులు వేగవంతమయ్యాయి. ట్రైలర్ ఎడిటింగ్ జరుగుతోందని మెగా కాంపౌండ్ న్యూస్. అదెప్పుడు వదులుతారనేది భేతాళ ప్రశ్న. సమాధానం లేక అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
సెప్టెంబర్ 25 డేట్లో ఎలాంటి మార్పు లేకపోతే ఓజి రావడానికి వంద రోజుల టైం కూడా లేదు. వీరమల్లు కోసమే దాని ప్రమోషన్లను ఆపింది డివివి ఎంటర్ టైన్మెంట్స్. కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే దాని ప్రభావం తమ మీద కూడా పడుతుందేమోననే ఆందోళన వాళ్లలో కలగడం సహజం. ఓజికి హైప్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. విఎఫ్ఎక్స్ సినిమా కాకపోయినా, రాజమౌళి లాంటి దర్శకుడు హ్యాండిల్ చేయకపోయినా కేవలం టీజర్, టైటిల్ తోనే విపరీతమైన బజ్ పెంచేసుకుంది. హఠాత్తుగా రిలీజ్ చేసినా మొదటి రోజు రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు వీరమల్లుకి రూట్ క్లియర్ కావాలి.
జనంలో క్రమంగా హరిహర వీరమల్లు మీద ఆసక్తి తగ్గిపోతున్న వైనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. ట్రైలర్ తో మొత్తం మారిపోతుందనే అతి విశ్వాసం ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా ఒక క్రమ పద్ధతిలో ప్రమోషన్లు చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ జూలై 18 లాక్ అనుకుంటే కేవలం నెల మాత్రమే టైం ఉంది. కాబట్టి అర్జెంట్ గా ఒక ప్రణాళిక వేసుకోవాలి. దీని కోసమే కింగ్ డమ్ లాంటి ఇతర సినిమాలు డేట్లు వేసుకోకుండా ఎదురు చూస్తున్నాయి. సో వీలైనంత త్వరగా వీరమల్లు క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగడం చాలా అవసరం.
This post was last modified on June 16, 2025 10:34 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…