ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాల తర్వాత కొత్తవి చేసే అవకాశం ఉండకపోవచ్చని సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం రిలీజ్ కు కాబోతున్నవి. ఇవి కాకుండా వీరమల్లు పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది. మరి తర్వాత జనసేన కోసం పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారా అనేది అభిమానుల మెదడును తొలుస్తున్న ప్రశ్న. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే రామ్ తాల్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవన్ ఒక స్క్రిప్ట్ కి మూడేళ్ళ క్రితమే ఎస్ చెప్పారు. తర్వాత ఆఫీస్ తీసి పూజా కార్యక్రమాల ఫొటోలు కూడా పెట్టారు.
తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇది మెల్లగా సైడ్ లైన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం, తర్వాత ఉపముఖ్యమంత్రిగా పాలనలో బిజీ కావడం లాంటి సంఘటనలు దీన్ని మర్చిపోయేలా చేశాయి. తర్వాత క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. తాజా అప్డేట్ ఏంటంటే ఇటీవలే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిశాడట. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న విషయాన్ని వివరించి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే సాధ్యాసాధ్యాలు చర్చించినట్టు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గత వర్గాలు చెబుతున్న ప్రకారం భేటీ జరిగింది. నిజమైతే మాత్రం సురేందర్ రెడ్డి జాక్ పాట్ కొట్టినట్టే.
అయితే ఏజెంట్ ఇచ్చిన దర్శకుడిగా సురేందర్ రెడ్డి మీద కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ గా తనని మరీ తక్కువంచనా వేయలేం. పైగా పవన్ ట్రాక్ రికార్డు చూసి ఛాన్స్ ఇచ్చే బాపతు కాదు. కథ నచ్చి, వర్కౌట్ అవుతుందని భావిస్తే గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు. కంబ్యాక్ అవ్వాల్సిన ఒత్తిడిలో సురేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉంటాడని టాక్. ఒకవేళ ఓకే అయితే మాత్రం 2026 వేసవిలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు. అయిదారు నెలల్లో పూర్తి చేసేలా స్టోరీ ఉందట. ఈ కలయిక ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి.
This post was last modified on June 12, 2025 11:01 am
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…