ఈ నెల 20న కుబేరతో పాటు 8 వసంతాలు అనే చిన్న సినిమా విడుదలవుతోంది. బడ్జెట్ పరంగా ఎంతయ్యిందనేది పక్కన పెడితే మైత్రి బ్యానర్ కావడంతో ఒక వర్గం మూవీ లవర్స్ లో దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి గతంలో మను అనే క్రౌడ్ ఫండింగ్ మూవీ తీశాడు. క్రిటిక్స్ ఏమో కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చక బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. ఇప్పుడీ 8 వసంతాలు తీసింది ఇతనే. తాజాగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆడియన్స్ అర్హత గురించి అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రకరకాల కోణాల్లో డిస్కషన్లు జరుగుతూ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చేస్తున్నాయి.
ఇంతకీ నరేంద్ర ఫనిశెట్టి అన్న పాయింట్ ఏంటంటే థగ్ లైఫ్ చూసి కొందరు మణిరత్నం, కమల్ హాసన్ లాంటి వాళ్ళు సినిమా ఎలా తీయాలో చెబుతున్నారని, అంత అర్హత మనకు ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. నలభై ఏళ్ళ క్రితం వాళ్ళు క్లాసిక్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు పుట్టి ఉండరని మరో వ్యాఖ్య చేశారు. అతని ఉద్దేశం ఏదైనా అర్హత అనే పెద్ద పదం వాడటం తన కామెంట్స్ మీద నెగటివిటీని తెస్తున్నాయి. వందా రెండు వందలు ఖర్చు పెట్టి సినిమా చూసే జనాలకు వాళ్లకు నచ్చింది ఇవ్వకపోతే ఖచ్చితంగా విమర్శలు చేస్తారు, ఫ్లాప్ చేతిలో పెడతారు. ఇక్కడ డెబ్యూ డైరెక్టరా లేక లెజెండరీ పర్సనా అనే లెక్కలు ఉండవు.
అందుకే కదా శంకర్ లాంటి జీనియస్ సైతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో దెబ్బలు తిన్నది. పొన్నియిన్ సెల్వన్ బయట రాష్ట్రాల్లో ఎక్కడ ఆడింది. కాబట్టి ఒకప్పుటి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకుని సింపతితో సినిమాలు చూసే రోజులు కావివి. తేడా కొడితే రిలీజ్ రోజు ఉదయం షోకే ప్యాన్ ఇండియా మూవీస్ బకెట్ తన్నేస్తున్నాయి. అలాంటప్పుడు అర్హత లాంటి పెద్ద మాటలు కవ్వించినట్టు అవుతుంది తప్ప మద్దతు తెచ్చుకోదు. ఏదైతేనేం ఇప్పుడీ టాపిక్ పుణ్యమాని 8 వసంతాలకు కాసింత ఉచిత్ర ప్రచారం దొరికేసింది. జూన్ 20న నరేంద్ర ఫణిశెట్టి సాలిడ్ కంటెంట్ తో రుజువు చేసుకోవాలి. అందులోనూ కుబేరతో పోటీ ఉంది.
This post was last modified on June 12, 2025 9:59 am
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…