Movie News

నయా ట్విస్ట్  –  పవన్ వస్తే విష్ణుకి ఇబ్బందా ?

రిలీజ్ డేట్ల పంచాయితీ పూటకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. జూన్ 12 ని హరిహర వీరమల్లు వదిలేసుకున్నాక కొత్త తేదీ ఏదనే దాని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. జూన్ 26 ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆప్షన్. అయితే మరుసటి రోజు జూన్ 27 కన్నప్ప వస్తోంది. మంచు విష్ణు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే మూడ్ లో లేడని మాటలను బట్టి అర్థమవుతోంది. ఇండస్ట్రీ జనాలు కొందరు ఇదే విషయంగా తనను ఆఫ్ ది రికార్డ్ అడిగితే ముందు అనౌన్స్ చేసింది నేను కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా తప్పుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడట.

ఒకవేళ ఇది నిజంగా జరిగితే ఎవరికి ఇబ్బంది అనే ప్రశ్న తలెత్తుతుంది. కన్నప్పలో మంచు విష్ణునే హీరో అయినప్పటికీ ప్రభాస్ క్యామియో మీద భారీ అంచనాలున్నాయి. అరగంట ఉంటాడని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఆ పాత్ర కనక తెరమీద పండితే ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కుతుంది. అదొక్కటే కాదు ఇతర క్యారెక్టర్లు, శివుడి ఎలిమెంట్, క్లైమాక్స్, పాటలు, కన్నప్ప గొప్పదనం చూపించే ఎపిసోడ్లు ఇలా దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని అంటున్నారు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ స్టార్ హీరోలు ఎవరున్నారు, ఎవరు లేరనే లెక్కలు వేసుకోని మాట వాస్తవమే.

ఇక ఇటువైపు చూస్తే హరిహర వీరమల్లు మీద బజ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నా ట్రైలర్ వచ్చాక లెక్కలు మారిపోతాయి. పెద్దగా ఆసక్తి లేదన్నట్టు కనిపిస్తున్న పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లోనే రికార్డులు మొదలవుతాయి. నిర్మాత  ఏఎం రత్నం హామీ ఇస్తున్నట్టు సినిమా కనక అదిరిపోతే పవన్ సునామిని తట్టుకోవడం కష్టం. ఇదే జరిగితే ఎంత ప్రభాస్ ఉన్నా సరే కన్నప్పకు కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. రెండింటికి ఫైనల్ గా టాకే కీలకం. వీరమల్లుకి జూలై 18 ఆప్షన్ కూడా ఉందట. చివరికి ఏది ఫైనల్ చేస్తారో ఎవరితో క్లాష్ కు సై అంటారో ఓ రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.

This post was last modified on June 9, 2025 4:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

2 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

4 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

6 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

7 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

8 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

9 hours ago