థియేటర్ రన్ పూర్తయ్యాక స్టార్ హీరోల సినిమాలకు ఓటిటి వ్యూస్ కూడా వాళ్ళ ప్రామాణికతకు కొలమానంగా మారుతున్నాయి. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా డిజిటల్ ఆడియన్స్ ని ఎంత మేరకు ఆకట్టుకుంటున్నారనే అంశాన్ని సదరు కంపెనీలు సీరియస్ గా పరిశీలిస్తున్నాయి. దీన్ని బట్టే తర్వాత కొనబోయే వాళ్ళ సినిమాలకు ఎంత రేట్ పెంచవచ్చో నిర్ణయించుకుంటున్నాయి. నాని ఈ విషయంలో విజయం సాధిస్తున్నాడు. చావాను మించిపోయేలా కోర్ట్ నెట్ ఫ్లిక్స్ లో అనూహ్య ఫలితాలు నమోదు చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండు మూడు వారాల పాటు ఈ ట్రెండ్ కొనసాగింది.
తాజాగా హిట్ 3 ది థర్డ్ కేస్ తో అలాంటి ఫీట్ మరోసారి నమోదు చేస్తున్నాడు. ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చిన హిట్ 3 వారం తిరక్కుండానే 4.2 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా దాని కన్నా జస్ట్ ఒక్క రోజు ముందు వచ్చిన రెట్రో 2.5 మిలియన్ల వ్యూస్ తో వెనుకబడింది. సక్సెస్ అయిన మూవీకి డిజాస్టర్ తో పోలికేంటని అనవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓటిటిలో ఈ పోలికలు సహజం. అన్ని భాషల్లో సూపర్ ఫ్లాప్ గా నిలిచిన అజిత్ విడాముయర్చి ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఎక్కువ శాతం చూశారు. ఆ మాటకొస్తే సల్మాన్ ఖాన్ సికందర్ ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ కన్నా ఒక ర్యాంక్ ముందు ఉంది.
సో నాని ఓటిటి మార్కెట్ లో ఎంత బలమైన బ్రాండ్ సృష్టించుకుంటున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడో నెగటివ్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. హిట్ 3 వ్యూస్ బాగున్నాయి కానీ ఆశించిన స్థాయిలో ఇంకా అద్భుతాలు చేయడం లేదు. ఏ సర్టిఫికెట్ వల్ల థియేటర్ లో మిస్సైన వాళ్ళు డిజిటల్ లో భారీగా చూస్తారని నెట్ ఫ్లిక్స్ ఆశిస్తోంది. కానీ రోజులు గడిచే కొద్దీ అంత మేజిక్ చేయగలదా అంటే అనుమానమేనని చెప్పాలి. ఏది ఏమైనా నాని ది ప్యారడైజ్ కి ఈ రిజల్ట్స్ మంచి కిక్ ఇస్తాయి. ఆల్రెడీ ఓటిటికి సంబంధించి క్రేజీ డీల్ అయిపోయిందని అంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on June 4, 2025 11:39 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…