మహేష్ బాబు సోదరి మంజులది టాలీవుడ్లో విభిన్న ప్రస్థానం. ఆమె ముందు కథానాయిక కావాలనుకుంది. కానీ కృష్ణ అభిమానులు అందుకు ఎంతమాత్రం అంగీకరించకపోవడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది. అయినా సరే.. ఆశ చంపుకోక చాలా ఏళ్ల తర్వాత ‘షో’ లాంటి విభిన్న చిత్రంతో కథానాయికగా కాకుండా నటిగా అరంగేట్రం చేసింది. ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేసి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. ఆ తర్వాత మంజుల మరికొన్ని సినిమాల్లో నటించడంతో పాటు ప్రొడక్షన్లోనూ భాగమైంది.
చివరగా ఆమె మెగా ఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అంటూ ఓ సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమాకు చేదు అనుభవం ఎదురవడంతో మంజుల మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఐతే ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఐతే మంజులగా కంటే కృష్ణ కూతురిగా, మహేష్ సోదరిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన తండ్రి, తమ్ముడి గురించి తరచుగా మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా మహేష్ గురించి మాట్లాడితే రీచ్ ఎక్కువ కాబట్టి అతడి గురించి వీలు చిక్కినపుడల్లా చర్చిస్తుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మంజుల.
మహేష్ తన కంటే చిన్నవాడే కానీ.. తనకంటే అతడికి మెచ్యూరిటీ ఎక్కువ అని ఆమె వ్యాఖ్యానించింది. తన కెరీర్ విషయంలో, వ్యక్తిగత జీవితంలో మహేష్ అనేక విలువైన సలహాలు ఇస్తుంటాడని ఆమె అంది. మహేష్‌కు సంబంధించిన అనేక సీక్రెట్లు ఉన్నాయని.. వాటిని అభిమానులతో త్వరలో పంచుకుంటానని అంది. బహుశా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానే మంజుల ఈ విషయాలన్నీ చెబుతుందేమో చూడాలి.
This post was last modified on November 9, 2020 1:41 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…