జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు 2014 నుండి మొన్నటి ఎన్నికల వరకు అలుపెరగకుండా గట్టిగా కృషి చేస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి మొదలైంది. నిజానికి 2014లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించటంలో పార్టీ సోషల్ మీడియా విభాగానిది చాలా కీలక పాత్రనటంలో సందేహం లేదు. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకనో టీడీపీ పెద్దలు సోషల్ మీడియా విభాగాన్ని పక్కన పెట్టేశారు.
ఎక్కడైతే సోషల్ మీడియా విభాగాన్ని టీడీపీ కాడిదింపేసిందో సరిగ్గా అక్కడే వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగా యాక్టివ్ అయ్యింది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ సోషల్ మీడియా విభాగం యాక్టివ్ అయిపోయిన విషయం అందరికీ అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటేనే చంద్రబాబు, చినబాబు లోకేష్ తో పాటు యావత్ టీడీపీ యాక్టివిటీస్ కు వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా వైసీపీ సోషల్ మీడియి విభాగం రెచ్చిపోయింది. దాంతో సోషల్ మీడియా విభాగాన్ని తట్టుకోవటం నిజంగా టీడీపీకి చాలా కష్టమైంది.
అందుకనే వైసీపీకి అనుకూలంగా కానీ లేదా చంద్రబాబు, లోకేష్, టీడీపీకి వ్యతిరేకంగా యాక్టివ్ గా ఉన్న ఎంతోమందిని అప్పట్లో పోలీసులు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. ఎంతమంది మీద కేసులు పెట్టినా, అరెస్టు చేసినా వైసీపీ సోషల్ మీడియా విభాగం వెనక్కు తగ్గలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ను హైలైట్ చేయటంలో సోషల్ మీడియా విభాగం తరపున పనిచేస్తున్న వారి కృషి అందరికీ తెలిసిందే.
అలాంటిది వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాగానే దాదాపు పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన సోషల్ మీడియా విభాగం వాళ్ళను పార్టీ పెద్దలు గుర్తిస్తారని అందరు అనుకున్నారు. ప్రభుత్వంలో ఏదో ఓ స్ధాయిలో భర్తీ చేసే పదవుల్లో తమను సర్దుబాటు చేస్తారని చాలామంది అనుకున్నారట. అంటే పార్టీ తరపున సర్పంచు, కౌన్సిలర్, ఎంపిటిసి, జడ్పిటీసీ స్ధానాలు లేకపోతే కార్పొరేషన్లలో డైరెక్టర్లగానో అవకాశం కల్పిస్తారని అనుకున్నారట. మరి అలా సర్దుబాటు చేశారో లేదో తెలీదు కానీ చాలామందిలో అసంతృప్తి అయితే మొదలైందన్నది వాస్తవం.
నిజానికి సోషల్ మీడియా తరపున లక్షలమంది పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ పదవుల్లో సర్దుబాటు చేయటం ఎవరికీ సాధ్యంకాదు. కానీ కష్టపడ్డాం కాబట్టి గుర్తింపు కావాలని కోరుకోవటంలో కూడా తప్పులేదు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారట. మరి జగన్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో ? వీరిలో అసంతృప్తి ఎలా తగ్గుతుందో చూడాల్సిందే.
This post was last modified on November 9, 2020 1:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…