Movie News

ఘాటీ వచ్చేస్తోంది…విశ్వంభర సైలెంటుంది

అనుష్క ఘాటీ విడుదల తేదీని రేపు ప్రకటించబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 11 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. వాస్తవానికి ఏప్రిల్ లో రావాల్సిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా రిలీజ్ డేట్ రాబోతున్న టైంలోనే ఘాటీ తొందరపడటం చూస్తుంటే రెండూ క్లాష్ కావడమో లేదా అతి తక్కువ గ్యాప్ ఉండటమో జరిగేలా ఉంది. ఇక విశ్వంభరకు ఇక్కడ చెబుతున్న దానికి లింక్ ఏంటో చూద్దాం.

ఘాటీ నిర్మిస్తున్న యువి క్రియేషన్సే విశ్వంభరకు నిర్మాతలు. నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన టీజర్, రామ రామ లిరికల్ సాంగ్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదల్లేదు. పోనీ రిలీజ్ డేట్ చెబితే హ్యాపీగా ఫీలవుతామని ఫ్యాన్స్ ఎంతగా కోరుతున్నా అది నెరవేరడం లేదు. ఇంతకు ముందు జూలై 24 అనే ప్రచారం జరిగింది కానీ ఆ సూచనలు తగ్గిపోయాయి. ఆగస్ట్ లో వార్ 2, కూలి, మాస్ జాతరలు కర్చీఫ్ వేసుకున్నాయి. ఇంకో రెండో మూడో జాయినైనా ఆశ్చర్యం లేదు. కానీ విశ్వంభర ఆ నెలలో వస్తే రిస్క్ అవుతుంది. అందుకే జూలై కన్నా బెటర్ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు.

ఇప్పుడు ఘాటీది లాక్ చేశారు కాబట్టి విశ్వంభర సెప్టెంబర్ వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేం. సరే ఎంత ఆలస్యమైనా ముందో తేదీని అనుకుని దాన్ని ఫిక్స్ చేసుకుంటే చాలా ఇబ్బందులు తగ్గుతాయి. ఒకపక్క మెగా 157  మొదటి షెడ్యూల్ అప్పుడే అయిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్నారు. కానీ వశిష్ఠ మాత్రం విశ్వంభర విషయంలో ఎలాంటి చొరవ చూపించడం లేదని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవికి సైతం ఎక్కడా దీని గురించి మాట్లాడే సందర్భం రావడం లేదు. ఇంతకీ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారా అనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు.

This post was last modified on June 1, 2025 6:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago