Movie News

బోల్డ్ సీన్లకు దీపిక భయడపడడమా.. హహహ

సందీప్ రెడ్డి వంగ సినిమాలు రిలీజ్ అవుతున్నపుడు, అయ్యాక వివాదాలు చెలరేగడం మామూలే. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’, దాని బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’.. ఆ తర్వాత వచ్చిన ‘యానిమల్’.. ఈ మూడు సినిమాల చుట్టూ పెద్ద పెద్ద వివాదాలే ముసురుకున్నాయి. కానీ ఈ సినిమాల్లోని సన్నివేశాలకు సంబంధించి తనను విమర్శించిన వాళ్లందరికీ దీటుగానే బదులిచ్చాడు వంగ. ఐతే ఇప్పుడు తన తర్వాతి చిత్రం ‘స్పిరిట్’ ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే వివాదం మొదలైపోయింది.

ఈ చిత్రానికి ముందు దీపికా పదుకొనేను కథానాయికగా ఎంచుకుని.. తర్వాత తప్పించడం మీద కొన్ని రోజులుగా జరుగుతున్న రచ్చంతా తెలిసిందే. దీపికను తప్పిస్తూ.. ఆమె పెట్టిన టూమచ్ కండిషన్ల గురించి మీడియాకు సమాచారం లీక్ అయ్యింది. దీంతో దీపిక తన పీఆర్ టీం సాయంతో బాలీవుడ్ మీడియా ద్వారా సందీప్ రెడ్డి మీద విషం కక్కిస్తోంది. దీనికి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు సందీప్. ఈ విషయాలన్నీ అలా ఉంచితే.. ‘స్పిరిట్’ నుంచి తాను తప్పుకోవడానికి దీపిక చెప్పిన కారణమే అందరికీ కామెడీగా అనిపిస్తోంది.

సినిమాలో బోల్డ్, ఎ రేటెడ్ సీన్ల మోతాదు ఎక్కువగా ఉండడంతోనే దీపిక తప్పుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వరుసగా వార్తలు వచ్చాయి. ఇదంతా దీపిక పీఆర్ టీమే రాయిస్తోందన్నది స్పష్టం. దీని గురించే సందీప్ ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ గట్టిగా రిటార్ట్ ఇచ్చాడు. ఐతే దీపిక ఇన్నేళ్లుగా చేసినవి ట్రెడిషనల్ క్యారెక్టర్లా.. ఆమె చేయని ఎక్స్‌పోజింగా.. ఆమె చేయని బోల్డ్ సీన్లా అంటూ నెటిజన్లు ఆమె మీద కౌంటర్లు వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’లో ఆమె చేసిన టూమచ్ ఎక్స్‌పోజింగ్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే.

యూట్యూబ్‌లోకి వెళ్లి దీపిక బోల్డ్ సీన్స్ అని కొడితే.. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మామూలుగా పెళ్లయ్యాక హీరోయిన్లు గ్లామర్ డోస్ తగ్గిస్తారు. బోల్డ్ సీన్లు చేయరు. కానీ దీపిక మాత్రం అలా చేయలేదు. ‘గెహ్రయాన్’ లాంటి సినిమాల్లో ఎంత బోల్డ్‌గా నటించిందో తెలిసిందే. అలాంటిది సందీప్ సినిమాలో బోల్డ్ సీన్లు చేయలేక సినిమా నుంచి తప్పుకుందంటే విడ్డూరంగా ఉంది. అయినా ప్రభాస్ నటించే సినిమాలో సందీప్ అంత బోల్డ్ సీన్లు పెట్టేంత సాహసమైతే చేయడు. ఒకవేళ బోల్డ్ సీన్లు ఉన్నా.. తన గత చిత్రాలతో పోలిస్తే, దీపిక ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే కచ్చితంగా డోస్ తక్కువే ఉంటుంది. కాబట్టి దీపిక చెబుతున్న కారణాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు.

This post was last modified on May 29, 2025 8:59 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

1 hour ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago