కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాలీవుడ్లో ప్రకంపనలు రేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ రెండు చిత్రాలూ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు కాగా.. ఈ చిత్రాల మీద విమర్శలు చేసిన అక్కడి క్రిటిక్స్, సినీ జనాలను సందీప్ ఎంత దీటుగా ఎదుర్కొన్నాడో తెలిసిందే. కట్ చేస్తే.. సందీప్ కొత్త చిత్రం ‘స్పిరిట్’ ఇంకా మొదలు కాకముందే బాలీవుడ్ అతణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ చిత్రానికి ముందు కథానాయికగా ఎంపికైన దీపికా పదుకునే అనూహ్యంగా తప్పుకుంది. అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో ‘యానిమల్’లో ప్రత్యేక పాత్ర చేసిన త్రిప్తి డిమ్రీ కథానాయికగా ఎంపికైంది.
ఐతే అంతటితో కథ ముగియలేదు. బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు మొదలయ్యాయి. ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని.. ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఐతే సందీప్ ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు. ఊరుకునే రకం కూడా కాదు. పీఆర్ స్టంట్స్ మొదలుపెట్టిన దీపికకు గట్టిగా కౌంటర్ ఇచ్చేశాడు. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ ద్వారా దీపిక పేరు ఎత్తకుండానే ఆమె మీద బాంబు వేశాడు సందీప్.
తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తానని.. కానీ ఆ కథను బయటపెట్టేయడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటిచెప్పారని సందీప్ వ్యాఖ్యానించాడు. తన కథను బయటపెట్టేయడమే కాక, ఒక యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం గురించి ప్రస్తావిస్తూ.. ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నించాడు సందీప్. ఒక సినిమా కోసం ఏళ్లు కష్టపడతామని చెబుతూ.. ఫిలిం మేకింగే తనకు అన్నీ అని.. అది ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదని సందీప్ అన్నాడు. మొత్తం కథను బయటపెట్టేసినా తనకు పోయేదేమీ లేదన్న సందీప్.. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించాడు. ఇది దీపికను ఉద్దేశించిన ట్వీటే అని అందరికీ అర్థమైపోవడంతో ఆమె మీద, బాలీవుడ్ పీఆర్ మాఫియా మీదా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on May 27, 2025 8:12 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…