-->

శేఖర్ కమ్ముల నుంచి ఊహించని ట్రాన్స్

జూన్ 20 విడుదలకు రెడీ అవుతున్న కుబేర టీజర్ ఇవాళ లాంచ్ చేశారు. ఒక్క డైలాగు లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వచ్చే పాటతో నాగార్జున, ధనుష్, జిమ్ సరబ్ లను పరిచయం చేస్తూ విజువల్స్ ని మాత్రమే పొందుపరిచిన వైనం ఆసక్తికరంగా ఉంది. అక్కడక్కడా రష్మిక మందన్నని రివీల్ చేసినప్పటికీ ఆ ముగ్గురితోనే నిమిషంన్నర కంటెంట్ నిండిపోయింది. నాదే నాదే నాదే అంటూ డబ్బు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడనే అంతర్లీన సందేశంతో శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నం విభిన్నంగా ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టైల్ మిక్స్ చేస్తూ దానికి టాలీవుడ్ కోటింగ్ ఇచ్చినట్టుగా ఉంది.

బ్యాక్ గ్రౌండ్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వెంటాడేలా ఉంది. ఒక కోటీశ్వరుడు, ఒక ప్రభుత్వ అధికారి, ఒక బిచ్చగాడు. వీళ్ళ మధ్య జరిగే మూడుముక్కలాటే కుబేర. ఒకరితో మరొకరికి సంబంధం లేని వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎలా కలుసుకున్నారనే పాయింట్ వెరైటీగా ఉండనుంది. ధనుష్ ని వెనకుండి నడిపించే పాత్రలో నాగార్జున ప్రాధాన్యత ఏంటో చిన్న క్లూస్ ఇచ్చిన కమ్ముల అంతకన్నా ఎక్కువ కథను గెస్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇంకా ట్రైలర్ బాకీ ఉంది కాబట్టి అప్పటిదాకా వేచి చూడాల్సిందే. మొత్తానికి అంచనాలు రేపడంలో శేఖర్ కమ్ముల సక్సెసయ్యారనే చెప్పాలి.

ఇంకో పాతిక రోజుల్లో థియేటర్లకు వస్తున్న కుబేరకు పోటీ పరంగా వారం ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉంటుంది. ఒకవేళ దానికి పాజిటివ్ టాక్ వస్తే కాచుకోవడం అంత సులభంగా ఉండదు. కుబేర వచ్చిన వారం తర్వాత కన్నప్ప దిగుతాడు. మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ క్యామియో బిజినెస్, ఓపెనింగ్స్ పరంగా దోహదం చేసేలా ఉంది. సో కుబేరకు యునానిమస్ టాక్ రావడం కీలకం. నిర్మాణం పరంగా ఎక్కువ సమయం తీసుకున్న ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ ఒకేసారి ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల చేయబోతున్నారు. నా సామి రంగా తర్వాత నాగ్ కనిపించే సినిమా ఇదే.