రాజాసాబ్ ఇప్పట్లో వస్తాడా…

ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చిన ది రాజా సాబ్ హఠాత్తుగా అప్డేట్లు ఆపేయడంతో కొన్ని నెలలు అయోమయం నెలకొన్న మాట వాస్తవం. ఒకపక్క ఫౌజీ షూట్ వేగంగా జరగడం లేనిపోని అనుమానాలను తీసుకొచ్చింది. తాజా సమాచారం మేరకు ది రాజా సాబ్ చిత్రీకరణ ఇంకో 30 రోజులు చేస్తే అయిపోతుందట. ఆ మేరకు దర్శకుడు మారుతీ ప్లానింగ్ సిద్ధం చేసి ఎక్కడ టాకీ పార్ట్ తీయాలి, పాటలకు ఏ లొకేషన్లు కావాలి వగైరా హోమ్ వర్క్ మొత్తం చేసి డార్లింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అన్నీ కుదిరితే ఈ నెలాఖరులో టీజర్ లాంచ్ చేయాలని చూస్తున్నారు.

విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి వచ్చేశాడు కాబట్టి ప్రధాన టెన్షన్ తీరినట్టే. ముందు రాజా సాబ్ టీజర్ డబ్బింగ్ చెప్పాక డేట్ల వ్యవహారం చూడబోతున్నాడు. ప్రస్తుతం తను అవసరం లేని సీన్లను తీస్తున్నారు. సంజయ్ దత్ తో పాటు ఇతర క్యాస్టింగ్ ఇందులో పాల్గొంటోందట. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ ఏకబికిన ముప్పై రోజుల కాల్ షీట్స్ ఇవ్వడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఫౌజీ కూడా సమాంతరంగా జరుగుతోంది. రెండింటికి అడ్జస్ట్ చేయగలిగితే ఇబ్బంది లేదు. కాకపోతే లుక్స్ పరంగా రెండూ ఒకటే కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారో చూడాలి.

విడుదల తేదీ విషయంలో ది రాజా సాబ్ ఎలాంటి ఆప్షన్లు పెట్టుకోలేదని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించిన మిరాయ్ ఆగస్ట్ 1 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ మూవీని వీలైతే డిసెంబర్ లో థియేటర్లకు తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధమవుతోందని అంటున్నారు. నిజానికి అభిమానులు కోరుకున్నది దసరాకు. కానీ ఇప్పుడది సాధ్యం కాదు. దీపావళి సరైన సీజన్ కాదు. సో సలార్ తరహాలో క్రిస్మస్ కు వచ్చేస్తే సోలోగా వసూళ్లు లాగేయొచ్చు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ హారర్ డ్రామాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటింస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోలనే గాసిప్ బలంగా ఉంది.