సూపర్ హీరోలంటే హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తాం అనుకునే వాళ్లకు సమాధానం చెప్పిన ఇండియన్ హీరో హృతిక్ రోషన్. క్రిష్ సిరీస్‌తో అతను భారతీయ ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే సూపర్ హీరోగా ఎదిగాడు. ప్రపంచ స్థాయి సూపర్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రూపం, స్క్రీన్ ప్రెజెన్స్ అతడి సొంతం. ఈ లక్షణాలే హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ను కూడా ఆకర్షించినట్లున్నాయి.
త్వరలోనే హృతిక్ ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం. ఈ హాలీవుడ్ మూవీ కోసం అమెరికాకు జెర్ష్ ఏజెన్సీతో హృతిక్ రోషన్ ఒప్పందం కూడా పూర్తయిందట. ఈ ఏజెన్సీకి ఇండియాలో మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అమృత సేన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
హృతిక్‌ను ఎలాంటి సినిమాతో హాలీవుడ్‌లో పరిచయం చేయాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అతను అక్కడ సినిమా చేయడం మాత్రం ఖాయమని అమృత స్పష్టం చేశారు. హృతిక్ అక్కడ మిషన్ ఇంపాజిబుల్ తరహా స్పై థ్రిల్లర్లో నటిస్తాడని అంటున్నారు. ఈ మేరకు హృతిక్‌కు ఆడిషన్ కూడా పూర్తయినట్లు చెబుతున్నారు.
గ్రీకువీరుడిలా కనిపించే హృతిక్ ఏ హాలీవుడ్ హీరోకూ తీసిపోని విధంగా ఉంటాడు. కాబట్టి అతడి హాలీవుడ్ సినిమా వర్కవుటవ్వడానికి అవకాశముంది. త్వరలోనే హృతిక్ తన తండ్రి దర్శకత్వంలో క్రిష్-4 చేయబోతున్నాడు. బాలీవుడ్లో అతడికి మరి కొన్ని కమిట్మెంట్లు ఉన్నప్పటికీ.. క్రిష్-4 తర్వాత హాలీవుడ్ సినిమానే చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చే అవకాశముంది.
This post was last modified on November 7, 2020 8:54 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…