దివి వద్త్యా బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగు పెట్టినపుడు ఆమె ఎవరనేది చాలా మందికి తెలీదు. తెలుపు వస్త్రాలలో నడుమందాలు చూపిస్తూ బిగ్‍బాస్ స్టేజీపై మెరిసే సరికి ఎవరీ మెరుపు తీగ అనుకున్నారు. నాగార్జున సయితం ఆమె అందానికి ముగ్ధుడయి అక్కడే కాంప్లిమెంట్ ఇచ్చేసాడు.
ఆ హౌస్‍లోకి వెళ్లిన కొద్ది రోజుల్లో సోషల్ మీడియా బఫ్స్ తవ్వి తీయగా… ఆమె మహర్షి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిందని గుర్తించారు. అప్పటికి ఆమె ఇన్‍స్టాగ్రామ్ ఫాలోవర్లు కనీసం ఇరవై వేలు కూడా లేరు. ఇన్‍స్టాగ్రామ్‍లో అందమైన అమ్మాయిలకు ఈ మాత్రం ఫాలోవర్లు వుండడం పెద్ద విషయమేమీ కాదు. బిగ్‍బాస్‍లో అడుగు పెట్టడం వల్ల దివి ఫాలోయింగ్ ఎన్నో ఇంతలయింది. ఇప్పుడామెకు నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్లు వున్నారు. ప్రస్తుత వేగం చూస్తోంటే త్వరలోనే మిలియన్ ఫాలోవర్స్ వచ్చి పడిపోతారు.
బిగ్‍బాస్ టైటిల్ గెలవలేకపోయినా కానీ ఇలా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న ఆనందంలో దివి వారికోసం తరచుగా లైవ్ చాట్‍లు చేస్తోంది. షార్ట్ వీడియోలు గట్రా చేస్తూ వారిని ఎంగేజ్ చేస్తోంది. చీరలో చితగ్గొట్టేసావ్ అనే కామెంట్లకు పొంగిపోతూ మరిన్ని శారీ షూట్లు కూడా చేసేస్తోంది. మరి హీరోయిన్ కావాలనే తన కలను కూడా త్వరగా సాకారం చేసుకుంటుందేమో చూడాలి.
This post was last modified on November 6, 2020 8:04 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…