ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంచు మనోజ్ దర్శకుడు శేఖర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త అభిమానుల మధ్య చర్చకు దారి తెస్తోంది. కారణం అతను తీసిన రెండు సినిమాలు ఆడకపోవడమే. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయతో పెద్ద బడ్జెట్ పెట్టి 90 ఎంఎల్ తీస్తే ఫలితం దక్కలేదు. చిన్న పిల్లలను ప్రధాన పాత్రల్లో పెట్టి తీసిన హౌస్ అరెస్ట్ అసలు వచ్చిన సంగతే ఎవరికీ తెలియనంతగా ఫ్లాపయ్యింది. హనుమాన్ కన్నా ముందు నిర్మాత నిరంజన్ రెడ్డి తీసిన మూవీ ఇది.
ఇప్పుడీ శేఖర్ రెడ్డికే మంచు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. అత్తరు సాయిబు టైటిల్ ని దాదాపుగా లాక్ చేశారట. మే 20 మనోజ్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని లాంచ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారని తెలిసింది. ప్రాజెక్ట్ కన్ఫర్మని, ఫైనల్ నెరేషన్ ఈ వారంలోనే పూర్తయ్యాక అప్పుడు మీడియాకు చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈలోగా లీక్ రూపంలో బయటికి వచ్చేసింది. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందే అత్తరు సాయుబులో మనోజ్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. కామెడీ ప్రధానంగా ట్రీట్ మెంట్ ఉంటుందని టాక్.
వ్యక్తిగత సమస్యలు ఎన్ని ఉన్నా మనోజ్ వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. భైరవం రిలీజ్ కు రెడీగా ఉంది. తేజ సజ్జ మిరాయ్ లో విలన్ గా నటించడం కొత్త బ్రేక్ ఇస్తుందని ఇప్పటికే టాక్ ఉంది. తను హీరోగా నటించిన వాట్ ది ఫిష్ గురించి అప్డేట్స్ బయటికి రావడం లేదు. ఇప్పుడు అత్తరు సాయిబు ద్వారా బలంగా కంబ్యాక్ అవ్వాలని అభిమానుల ఆకాంక్ష. గతంలో ఉన్న దూకుడు మళ్ళీ పెంచే దిశగా మనోజ్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే మనోజ్ నుంచి ఎస్ రావడమే లేటవుతోంది. అత్తరు సాయిబు మాత్రం ఫాస్ట్ గానే అయ్యేలా ఉన్నాడు.
This post was last modified on May 9, 2025 12:09 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…