పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటికి అడుగు పెట్టాడంటే అందరి చూపూ ఆయన మీదే ఉంటుంది. ఆయనకు సంబంధించి ప్రతి విషయం వార్తే. ఏడు నెలలకు పైగా విరామం తర్వాత పవన్ ఇటీవలే తిరిగి షూటింగ్‌కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’కు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు పవన్. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఐతే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాలనేమీ పక్కన పెట్టేయని పవన్.. మధ్య మధ్యలో పార్టీ పనులు చూసుకుంటూనే ఉన్నాడు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఉండగానే షూటింగ్ గ్యాప్‌లో జనసేన తెలంగాణ కమిటీలను ఖరారు చేసి దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేశాడు పవన్. జనసేనాని రాజకీయాలపై సీరియస్‌గానే ఉన్నాడని సంకేతాలు ఇవ్వడం కోసమో ఏమో.. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేశారు.
ఐతే ఆ ఫొటోలకు సంబంధించి పవన్ అభిమానుల దృష్టి ఒకలా ఉంటే.. వ్యతిరేకుల దృష్టి మరోలా ఉంది. పవన్ అందులో ధరించిన రోలెక్స్ వాచీ గురించి చర్చ మొదలు పెట్టారు. దాని ధర రూ.40 లక్షలకు పైగానే అట. తాను చాలా సింపుల్ అని చెప్పుకునే పవన్ ఇంత ఖరీదైన వాచ్ ధరించాడేంటి అని వాళ్లు ప్రశ్న లేవనెత్తారు. ఐతే అసలు విషయం ఏంటంటే.. ఆ వాచీ ధరించింది సినిమా చిత్రీకరణలో భాగంగా అనిు రుజువు చేయడానికి పవన్ అభిమానులు కష్టపడాల్సి వచ్చింది.
ఇంతకుముందు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పవన్ లుక్ ఒకటి పరిశీలిస్తే అందులో పవన్ ఈ వాచీనే ధరించాడు. కంటిన్యుటీ కోసం అదే వాచ్‌తో షూటింగ్‌కు హాజరయ్యాడు. మన సినిమాల్లో హీరో ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా సరే.. ఖరీదైన బట్టలు, యాక్ససరీస్ ధరించాల్సిందే. అందులో భాగంగానే పవన్‌కు ఆ వాచీ పెట్టినట్లున్నారు. బయట అయితే ఇంత ఖరీదైన వాచీ పెట్టుకుని తిరిగే రకమైతే కాదు పవన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates