రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందుతున్న పెద్ది ఈ వారం నుంచి బ్రేక్ తీసుకోనుంది. టుస్సాడ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్న చరణ్ తిరిగి రావడానికి రెండు మూడు వారాలు పట్టేలా ఉంది. పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. రంగస్థలం జిగేలు రాణి తరహాలో ఒక ఊర మాస్ పాటను ప్లాన్ చేశారట. దీనికి కాజల్ అగర్వాల్ ని సంప్రదించారనే పుకారు బాగానే చక్కర్లు కొట్టింది. ఇంతకు ముందు జనతా గ్యారేజ్ టైంలో వర్కవుట్ అయ్యింది కానీ ఇప్పుడు కాజల్ ఉన్న ఇమేజ్, పరిస్థితికి సెట్ కాదు. ఉట్టి గాసిప్ ని సోషల్ మీడియాలో తిప్పారు. అయితే బుచ్చిబాబు ప్లానింగ్ వేరే ఉందట.
పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ అంటూ క్రేజీ డాన్సులు చేసిన శ్రీలీలను పెద్దిలో రామ్ చరణ్ సరసన ఆడిపాడేలా ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రాధమికంగా అనుకున్నారని తెలిసింది. అయితే శ్రీలీల డేట్లు అంత సులభంగా దొరకడం లేదు. మాస్ జాతర తన కోసమే వెయిటింగ్ లో ఉంది. ఇంకో మూడు పాటలు పెండింగ్ ఉన్నాయి. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న డెబ్యూ మూవీ కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో మాస్ జాతరకు బ్రేక్ పడింది. ఈ కారణంగానే రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. శ్రీలీల ఫ్రీ అవ్వగానే రవితేజ రంగంలోకి దిగుతాడు. ఇక్కడితో అయిపోలేదు.
శివకార్తికేయన్ పరాశక్తి, అఖిల్ లెనిన్ లు ఇంకా పూర్తి కావాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కనక తిరిగి ప్రారంభమైతే దానికి డేట్లు ఇవ్వాలి. కాకపోతే పెద్దికి అవసరమయ్యేది కొద్దిరోజులు కాబట్టి వీలు చేసుకుని శ్రీలీల ఓకే చెప్పొచ్చు. విడుదలకు ఇంకా పది నెలల సమయముంది. బుచ్చిబాబు మీద ఎలాంటి ఒత్తిడి లేదు. పుష్ప 2 తీసిన మైత్రి మేకర్సే పెద్దికి నిర్మాణ భాగస్వాములు కనక నో చెప్పే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన స్టేజిలోనే ఉంది. సో అఫీషియలయ్యే దాకా చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం, శివరాజ్ కుమార్ పాత్ర మీద ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on May 5, 2025 2:08 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…