శుభం దర్శకుడి కాన్ఫిడెన్స్ వేరే లెవల్

మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో  సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో కూడా చేసింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సినిమాబండితో పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా అంతా కొత్త క్యాస్టింగ్ లో తక్కువ బడ్జెట్ లో నిర్మించారు.  ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రవీణ్ స్టేట్ మెంట్లు చూసి మీడియా సైతం ఆశ్చర్యపోయింది. ఎవరైనా తమ చిత్రం రిలీజ్ కు ముందు గొప్పలు చెప్పుకోవడం సహజం. దానికి చిన్నా పెద్దా తేడా ఉండదు. వర్కౌట్ అయితే ఒకే. కాకపోతే కొన్నిసార్లు అవి మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తేనే ఇబ్బందులు తలెత్తుతాయి.

ప్రవీణ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా తెలుగు ఇలాంటి కంటెంట్ రాలేదని, చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారని, అప్పట్లో జంబలకిడిపంబ చూశామని, కానీ ఇలాంటి హారర్ కామెడీని తెలుగు ప్రేక్షకులు మొదటిసారి అనుభూతి చెందుతారని పెద్ద ప్రామిస్ చేసేశాడు. అంతే కాదు శుభం మార్నింగ్ షో చూసేవాళ్ళు చాలా లక్కీ అని, తర్వాత టాక్ స్ప్రెడ్ అయిపోయి శని ఆదివారాలు అందరూ ఏందిరా ఈ సినిమాని మాట్లాడుకుంటారని, వైజాగ్ గడ్డ మీద ప్రమాణం చేస్తున్నానని బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఇదంతా చూస్తున్న సమంత మొహంలో ఆశ్చర్యం, ఆనందం రెండూ కనిపించాయి.

శుభం బ్లాక్ బస్టర్ అయితే ఇదే స్పీచ్ కు విలువ పెరుగుతుంది. లేదంటే కేవలం వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడాడనే క్లారిటీ వస్తుంది. ఏది తేలాలన్నా ఇంకో అయిదు రోజలు ఆగాల్సిందే. హిట్ 3 ది థర్డ్ కేస్ దూకుడు వీక్ డేస్ లో తగ్గే సూచనలు ఉండటంతో శ్రీవిష్ణు సింగిల్ తో పాటు సమంతా శుభంకు మంచి ఛాన్స్ దక్కనుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేయొచ్చు. మజిలీ, రంగస్థలంలాగే శుభం ఈవెంట్ కూడా విశాఖపట్నంలో జరుగుతోంది కాబట్టి మరోసారి తనకు బ్లాక్ బస్టర్ ఇస్తారనే నమ్మకాన్ని స్టేజి మీద సమంతా వ్యక్తం చేయడం కొసమెరుపు.