
సౌత్ ఇండస్ట్రీలో మాస్ గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ నభా నటేష్. కర్ణాటక నుంచి వచ్చిన ఈ బ్యూటీ 2015లో కన్నడ సినిమా “వజ్రకాయ”తో యాక్టింగ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో “నన్ను దోచుకుందువటే” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదుగో డబుల్ ఇస్మార్ట్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నభా నటనతో పాటు ఆమె అందం, గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. నభా నటేష్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు చూస్తే ఆమె గ్లామరస్ లుక్స్ కు ఫిదా అవ్వాల్సిందే. ఎరుపు రంగు లెహంగా చోళీలో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఎరుపు దుపట్టా, బంగారు నగలు ఆమె అందానికి మరింత ఒప్పుగా ఉన్నాయి. ఆ డ్రెస్ పై బంగారు బార్డర్, చిన్న చిన్న డిజైన్లు ఆమె లుక్‌ను మరింత స్పెషల్‌గా చేశాయి. నభా స్టైల్‌లో ఎప్పుడూ ఒక ట్రెడిషనల్ టచ్ ఉంటుంది.

ఆమె లెహంగాలో కూర్చున్న ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే బంగారు నగలు, చేతుల్లో బంగారు గాజులు చాలా అందంగా ఉన్నాయి. నభా ఎప్పుడూ తన డ్రెస్సింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె సింపుల్‌గా ఉంటూనే గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates