Movie News

థాంక్స్ నాని….థియేటర్లు నిండుతున్నాయి

సరైన సినిమా రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమై గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. కానీ హిట్ 3 ది థర్డ్ కేస్ వాతావరణాన్ని మార్చేసింది. రెండు మూడు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ ఫిగర్లు నమోదు చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా చోట్ల షోలు ఫుల్ అయిపోయి అదనంగా జోడించాల్సిన అవసరంలో ఏ మాత్రం అవకాశం ఉన్నా సర్దుబాటు చేస్తున్నారు,.

ఇవాళ నిర్వహించిన చిన్న ప్రెస్ మీట్ లో దిల్ రాజు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు వస్తారా రారా అని టెన్షన్ పడుతున్న టైంలో హిట్ 3 ఆక్సీజెన్ అయ్యిందని, బ్లాక్ బస్టర్ టాక్ తో అంతకంతా పెరుగుతూ పోతోందని నానితో సంతోషాన్ని పంచుకున్నారు. నాని మాట్లాడుతూ నా జడ్జ్ మెంట్ మరోసారి నిజమని రుజువు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. పోటీ అవుతుందనుకున్న రెట్రోకి తెలుగులో ఆశాజనకమైన టాక్ లేదు. డీసెంట్ ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ అవి వీకెండ్ వరకు ఎంత శాతం స్థిరంగా ఉంటాయనేది చెప్పలేం. హిట్ 3 ఓవర్ ఫ్లోస్ పలుచోట్ల రెట్రోకు ఉపయోగపడుతున్న వైనం సుస్పష్టం.

మొత్తానికి హిట్ 3కి వచ్చిన రెస్పాన్స్ కి అందరూ హ్యాపీనే. కాకపోతే దీన్ని ఇలాగే నిలబెట్టుకుంటూ రెండో వారం కూడా కొనసాగించాలి. ఏపీలో టికెట్ రేట్లు పెంచిన ప్రభావం ఏమంత నెగటివ్ కాలేదు. ఇచ్చిన రేటుకి న్యాయం జరిగిందని ఆడియన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ తర్వాత 2025లో దక్కిన మరో క్లీన్ హిట్ దిశగా వెళ్లేందుకు హిట్ 3 పరుగులు పెడుతోంది. నాని పాత్ర, స్టార్ హీరోల క్యామియోలు, విభిన్నమైన బ్యాక్ డ్రాప్, వయొలెన్స్ ఉన్నా దానికి న్యాయం చేసిన స్టోరీ ఇలా చాలా అంశాలు హిట్ 3 విజయానికి దోహదం చేస్తున్నాయి. దసరాని దాటుద్దా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.

This post was last modified on May 1, 2025 5:43 pm

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

40 minutes ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

1 hour ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago