దేశవ్యాప్తంగా కొన్ని వారాలుగా థియేటర్ల పరిస్థితి దారుణంగా మారడం వివిధ ఫిలిం ఇండస్ట్రీలను కలవరపాటుకు గురి చేస్తోంది. దేశంలో భారీగా థియటర్లు ఉన్న రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో అయితే ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. ఆక్యుపెన్సీలు రోజు రోజుకూ పడిపోతుండడం.. జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయడం మామూలైపోయింది. ఒకప్పుడు వేసవి అంటే థియేటర్లు జనాలతో కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవిలో ఇప్పటిదాకా వచ్చిన చిత్రాలేవీ థియేటర్లలో సందడి తీసుకురాలేకపోయాయి. ఇలాంటి టైంలో నేచురల్ స్టార్ నాని థియేటర్లకు ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.
టాలీవుడ్‌కు చివరగా విజయాన్నందించిన సినిమా.. కోర్ట్. ఆ చిత్రానికి నాని నిర్మాత. ఇప్పుడు అతను హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిన ‘హిట్-3’ మళ్లీ థియేటర్లకు కళ తీసుకొస్తోంది. సంక్రాంతి సినిమాల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు చూపిస్తున్న చిత్రం ‘హిట్-3’నే. థియేటర్ల ముందు మళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు పడబోయేది ఈ చిత్రానికే. ఆల్రెడీ ఆన్ లైన్ టికెటింగ్ యాప్‌లో చాలా షోలు సోల్డ్ ఔట్ స్టేటస్‌కు వచ్చేశాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోని షోలు కూడా పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.
వేసవిలో భారీ చిత్రాలేవీ రేసులో లేకపోవడంతో ‘హిట్-3’నే పెద్ద సినిమాగా భావించి ఒక పెద్ద హీరో మూవీ రేంజ్‌లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక బెంగళూరులో కూడా ‘హిట్-3’ జోరు మామూలుగా లేదు. యుఎస్‌లో కూడా చాన్నాళ్ల తర్వాత ప్రి సేల్స్‌లో ఓ సినిమా దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ప్రి సేల్స్‌తోనే 3 లక్షల డాలర్ల మార్కును దాటేసింది నాని సినిమా. ప్రిమియర్స్‌తోనే సినిమా హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం లాంఛనమే. వీకెండ్లో మిలియన్ డాలర్ క్లబ్బులోకి కూడా అడుగు పెట్టడం ఖాయం. నాని కెరీర్లోనే ఈ చిత్రం హైయెస్ట్ ఓపెనింగ్ అందుకోబోతోంది. టాక్ బాగుంటే ‘దసరా’ను దాటి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవొచ్చు.
This post was last modified on April 30, 2025 6:12 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…