Movie News

ఎన్నో బాయ్ ఫ్రెండ్ అంటారు-శ్రుతి హాసన్

లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూతురు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. కొన్నేళ్లకే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది శృతి హాసన్. కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఆ తర్వాత బాగానే నిలదొక్కుకుంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. శృతి సినిమాల పరంగానే కాక వ్యక్తిగత విషయాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె జీవితంలో ఇప్పటికే రెండు విఫల ప్రేమగాథలున్నాయి. గతంలో మైకేల్ కోర్సాలే అనే యూకే నటుడు, మ్యుజీషియన్‌తో ఆమె కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉంది.

తర్వాత అతడి నుంచి విడిపోయి కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న శృతి.. తర్వాత శాంతను అనే విజువల్ ఆర్టిస్ట్‌తో కొంతకాలం ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతడి నుంచి కూడా విడిపోయి సింగిల్ స్టేటస్‌లోకి వచ్చేసింది. ఐతే తన లవ్ లైఫ్ గురించి జనాలు మాట్లాడుకునే తీరు, అడిగే విధానం తననెంతో బాధిస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉంటాయి. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. నాక్కూడా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి. బ్రేకప్ అయ్యాక దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఐతే నా లవ్ స్టోరీలను ఉద్దేశించి జనం మాట్లాడే తీరు చిత్రంగా ఉంటుంది.

‘ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్’ అని అడుగుతుంటారు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే.. వాళ్లకు అది ఒక నంబర్ మాత్రమే. కానీ నా సంగతి వేరు. నేను కోరుకున్న ప్రేమను పొందడంలో నేను అన్నిసార్లు ఫెయిలయ్యానని అర్థం. అది నన్ను బాధ పెడుతుంది. నేనూ మనిషినే కదా. ఇది ఎందుకు అర్థం చేసుకోరు. నేను బ్రేకప్ తర్వాత ఆ వ్యక్తిని నిందించనని, మనిషి మారడం సహజమే అని.. తాను మాత్రం రిలేషన్‌షిప్‌లో నిజాయితీగా ఉండడానికే ప్రయత్నిస్తానని శ్రుతి చెప్పింది. కెరీర్ ఆరంభంలో తాను నటించిన రెండు చిత్రాలు ఫెయిలయ్యాయని.. దీంతో తనపై ఐరెన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ ఆ రెండు చిత్రాల్లో హీరోగా చేసిన సిద్ధార్థ్‌ను ఎవరూ ఏమీ అనలేదని శ్రుతి వ్యాఖ్యానించడం విశేషం.

This post was last modified on April 27, 2025 1:08 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

57 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago