ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ మొదలై నెలలు గడిచి రెండు షెడ్యూల్స్ అయిపోయినా ఇప్పటిదాకా ఒక్క అప్డేట్ లేకపోవడం మహేష్ అభిమానులను డిస్ట్రబ్ చేస్తోంది. కనీసం పూజా కార్యక్రమాల వీడియో అయినా రిలీజ్ చేయాల్సిందని ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. జక్కన్న ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే కనీసం సెల్ ఫోన్లలో తీసిన ఫోటో సైతం బయటికి రాలేదు. ఆ రోజు పూజకు హాజరైన వాళ్లకు తప్ప బయట ప్రపంచానికి ఆ తతంగం ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మహేష్ మూవీ గురించి ఏమైనా మాట్లాడతాడానే ఆశలు ఫాన్స్ లో ఉన్నాయి.
అయితే ఒక్కటి స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. రాజమౌళి వస్తోంది నాని ఈవెంట్ కి. ఎట్టి పరిస్థితుల్లో వేరే టాపిక్ మీదకు డైవర్ట్ అవ్వడానికి ససేమిరా ఒప్పుకోరు. యాంకర్ ఒత్తిడి చేసినా, ఫ్యాన్స్ గోల చేసినా ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఒక నవ్వు నవ్వేసి టైం వచ్చినప్పుడు చెబుతానని తప్పించుకుంటారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వరు. సో హిట్ 3 వేడుకను ఆ కోణంలో చూడకుండా నాని వైపు నుంచి మాత్రం ఎంజాయ్ చేయాలి. త్వరలో ఆఫ్రికా వెళ్ళబోతున్న ఎస్ఎస్ఎంబి 29 టీమ్ ప్రస్తుతం వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. అక్కడో నెల నుంచి రెండు నెలల మధ్య చిత్రీకరణ ఉంటుందని యూనిట్ టాక్.
మే 31 కృష్ణగారి పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ఆ రోజు ఏమైనా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం లేకపోలేదు. చిన్న టీజర్ సిద్ధమవుతోందని అంటున్నారు కానీ రాజమౌళి రాజముద్ర పడితే తప్ప అది బయటికి రాదు. లేదంటే ఏదైనా పోస్టర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. సాధారణంగా తన కొత్త ప్రాజెక్టులను ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించే రాజమౌళి మహేష్ సినిమాకు ఆ లాంఛనం ఇంకా పూర్తి చేయలేదు. అదేదో మేలో జరగాలని ఫ్యాన్స్ కోరిక. విడుదల తేదీతో సహా అన్ని వివరాలు పక్కాగా సెట్ చేసుకున్నాకే రాజమౌళి మీడియా ముందుకు వస్తారట. మరి అది ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతుందనేది ఇప్పటికి సస్పెన్సే.
This post was last modified on April 27, 2025 12:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…