కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాలను ఆర్టిస్టులు తర్వాత ఎప్పుడో చూసుకుంటే.. అందులో నటన సరిగా లేదని అనిపించడం మామూలే. ఈ మధ్యే సమంత ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగులో తన తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ను ఇప్పుడు చూసుకుంటే.. అందులో తాను దారుణంగా నటించినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించి అభిమానులకు షాకిచ్చింది. సమంత బెస్ట్ పెర్ఫామెన్స్‌ల్లో ఒకటిగా భావించే ఆ చిత్రంలో తన నటన సమంతకు నచ్చకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి కామెంటే చేశాడు.
తనకు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ను ఇప్పుడు చూస్తే తన నటన అంతగా నచ్చలేదని నాని చెప్పాడు. ఈ చిత్రం ఇటీవలే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు నాని కూడా థియేటర్‌కు వెళ్లి అభిమానుల మధ్య ఆ సినిమ ా చూశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న సుబ్రహ్మణ్యం పాత్రలో నాని చాలా బాగా నటించాడని అప్పట్లో మంచి పేరొచ్చింది. కానీ నానికి మాత్రం ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చూస్తే తాను బాగా నటించలేదని అనిపించిందని తెలిపాడు. ఇక తన కెరీర్లో ‘జెర్సీ’ చాలా స్పెషల్ మూవీ అని చెప్పిన నాని.. ఇప్పుడు తన ఇమేజ్ పెరిగిందని అలాంటి సినిమాలు మానేయడం లాంటిదేమీ ఉండదని చెప్పాడు.
ప్రతి రెండు మూడు సినిమాల తర్వాత ‘జెర్సీ’ లాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు తనకు పెరిగిన రీచ్‌తో ‘జెర్సీ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను మరింతమంది ప్రేక్షకులకు చేరువ చేయాలని కోరుకుంటానని నాని అన్నాడు. తమిళంలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ గురించి నాని ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘లవ్ టుడే’లో తన నటన చూసి ఆశ్చర్యపోయానన్న నాని.. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘కోమాలి’ తర్వాత అతను తనకు ఓ కథ చెప్పాడని.. అది బాగున్నా వర్కవుట్ కాలేదని నాని చెప్పాడు.
This post was last modified on April 27, 2025 1:12 pm
నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…
కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…
కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…