ఆమిర్ ఖాన్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఆయన సినిమాల్లో ‘తారే జమీన్ పర్’ చాలా స్పెషల్. నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగానూ తనదైన ముద్ర వేసిన సినిమా అది. ఆమిర్ డైరెక్ట్ చేసిన ఏకైక చిత్రమిది. తొలి చిత్రమే అయినా.. భావోద్వేగాలను అద్భుతంగా పండించి మెప్పించాడు. ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘తారే జమీన్ పర్’ గుర్తింపు తెచ్చుకుంది. ఆమిర్ హీరోగా పీక్స్‌లో ఉండగా ఈ సినిమా తీసి దర్శకుడిగా కూడా గొప్ప పేరు సంపాదించాడు.
ఐతే ఇప్పుడు హీరోగా ఎన్నడూ లేని స్లంప్ చూస్తున్న దశలో ఆమిర్ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ‘తారే జమీన్ పర్’కు కొనసాగింపుగా ‘సితారే జమీన్ పర్’ తీస్తున్నాడు. ఈ సినిమా గురించి తొలిసారి ఓపెన్ అయ్యాడు ఆమిర్. ‘తారే జమీన్ పర్’ లాగా ఇది ఎమోషనల్ సినిమా కాదని ఆమిర్ చెప్పడం విశేషం. ఆ సినిమాలో ప్రేక్షకులను ఏడిపించామని.. ఈ సినిమాలో నవ్వించడమే ప్రధాన లక్ష్యమని ఆమిర్ తెలిపాడు.
‘‘సితారే జమీన్ పర్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కథ దివ్యాంగుల నేపథ్యంలో నడుస్తుంది. ‘తారే జమీన్ పర్’ మిమ్మల్ని ఏడిపించింది. కానీ ‘సితారే జమీన్ పర్’ నవ్విస్తుంది. తొలి చిత్రంలో నేను సున్నితమైన భావాలున్న వ్యక్తిగా నటించాను. కానీ ఇందులో నా పాత్ర భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. నా పాత్ర రాజకీయ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తుంది. కుటుంబ సభ్యులతోనూ గొడవపడి అవమానిస్తుంటుంది. ఎన్నో అంతర్గత సమస్యలతో బాధ పడే వ్యక్తి మంచివాడిగా ఎలా మారాడాన్నదే ఈ కథ’’ అని ఆమిర్ తెలిపాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘సితారే జమీన్ పర్’ విడుదలవుతుంది.
This post was last modified on April 23, 2025 2:24 pm
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…