వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయ డమేరాజకీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొందరు ఇతర పార్టీల్లోకి వచ్చి విజయం దక్కించుకున్నారు. మరికొందరు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. నాయకులు కొందరు వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి వారు తమ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు.
ఉదాహరణకు.. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్కే రోజా, మల్లాది విష్ణు సహా.. అనంతపురం వైసీపీ నాయకుల్లో కొందరు తమ పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. దీంతో వారంతా మైనస్ అవుతున్నారు. పైగా పార్టీని కూడా మైనస్ చేస్తున్నారు. తరచుగా పవన్ పై విరుచుకుపడిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి భారీ ఎదురు దెబ్బే తగిలింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా ఉచ్చు బిగుసుకుంటున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలు.. స్థానికంగా ఉన్న మిత్రుల ద్వారా చెప్పించి.. ఆయన ప్రస్తుతానికి బయట పడ్డారు.
అయితే.. ఈ విషయాన్ని ద్వారంపూడి మరిచిపోయి… మళ్లీ గత నాలుగు రోజులుగా.. పవన్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. తన పేరుబయటకు రాకుండా.. తన అనుచరులతో కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇక, రోజా సంగతి అప్పుడు.. ఇప్పుడు మారలేదు. తాను ఓడానని కూడా ఆమె భావించ కపోవడం గమనార్హం. ఈవీఎంలే.. గాలి భాను ప్రకాష్‌రెడ్డిని నగరిలో గెలిపించాయని.. చెప్పుకురావడం ఆమె గడుసు తనానికి నిదర్శనం. ప్రజాతీర్పును కూడా.. పట్టించుకునే పరిస్థితిలో రోజా లేరు.
ఇక, అనంతపురానికి చెందిన కొందరు నాయకులు.. పార్టీ వ్యవహారాలను తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. ఓడిపోయి ఏడాది అయినా.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ వైసీపీపైనే చురకలు అంటిస్తున్నారు. మంచి చెప్పడాన్ని ఎవరూ తప్పుబట్టరు. సూచనలు కూడా.. చేయొచ్చు. కానీ.. పార్టీని బోనులో ఎక్కించేలా వ్యవహరిస్తున్నారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. రాజమండ్రి రూరల్‌లో పోటీ చేసి ఓడిపోయిన వేణు కూడా.. తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారు. వెరసి.. వీరివల్ల పార్టీకి ప్రయోజనం కంటే.. మరింత డ్యామేజీనే జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 8:39 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…