Political News

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి వెనుక దాయాదీ దేశం పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్… పాక్ తో సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతపై కేబినెట్  కమిటీ భేటీలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో పాక్ తో భారత్ సంబంధాలు పూర్తిగా రద్దు అవుతాయి. పాక్ పౌరులను ఏ రకంగానూ భారత్ లోకి అనుమతించరు. అంతేకాకుండా పాక్ తో దౌత్యపరమైన సంబంధాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. 

భద్రతపై కేబినెట్ కమిటీ భేటీ ముగిసిన వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న పాక్ పర్యాటకులతో పాటు ఇతరత్రా పనుల నిమిత్తం భారత్ వచ్చిన ఆ దేశ పౌరులు భారత్ ను వీడేందుకు కేవలం 48 గంటల వ్యవధిని ఇస్తున్నట్లు మిస్రీ తేల్చి చెప్పారు. అంటే.. గురు, శుక్రవారా ల్లోగా పాక్ పౌరులు భారత్ ను వీడాల్సి ఉంటుంది. ఇకపై భారత్ లోకి పాక్ పర్యాటకులను గానీ, ఇతరత్రా ఏ కారణాలతో అయినా గానీ ఆ దేశ పౌరులను అనుమతించేది లేదని కూడా తేల్చి చెప్పారు. అంతేకాకుండా భారత్ లోని పాక్ హై కమిషనర్ ను దేశం వదిలి వెళ్లిపోవాల్సింది ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇదిలా ఉంటే… పాక్ ఇప్పటిదాకా కొనసాగుతున్న భారత సంబంధాలు పూర్తిగా స్తంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేస్తున్నట్లుగా మిస్రీ వెల్లడించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య అమలు అవుతున్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. పెహల్ గాం ఉగ్ర దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలోనే జరిగిందని, దాడికి పాకిస్తాన్ సైన్యాధిపతి నుంచి కూడా పూర్తిగా సహకారం అందిందన్న ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దీంతోనే ఈ దాడిని ఈజీగా తీసుకోరాదన్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 23, 2025 9:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

57 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

1 hour ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago