Movie News

చిరు – ఓదెల : బయోపిక్ రేంజ్ బొమ్మ!

విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ కోసం అప్పుడే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ది ప్యారడైజ్ అయ్యేదాకా దీని షూటింగ్ మొదలయ్యే అవకాశం లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది కొబ్బరి కాయ కొట్టడం ఖాయమే. ఇదిలా ఉండగా నాని ఇందులో నటించనప్పటికీ ఒక ప్రొడ్యూసర్ గా చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధితో జరిపిన ముఖాముఖీకి దీని గురించి ఓపెనయ్యాడు.

చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ పరిసరాల్లో ఎన్నో చిరంజీవి పోస్టర్లు చూస్తూ పెరిగిన వాడిగా ఆయనంటే ఉన్న ఎనలేని అభిమానం, ఇప్పుడు మెగాస్టార్ మూవీకే నిర్మాతగా పేరు చూసుకుంటే ఒక బయోపిక్ తీస్తున్న ఫీలింగ్ కలుగుతోందని అన్నాడు. అందుకే ఎప్పుడూ దీని గురించే ఆలోచిస్తూ ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతిని సినిమా రూపంలో ఇవ్వాలనే తాపత్రయాన్ని వ్యక్తం చేశాడు. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నానని మరింత ఊరించాడు. దీన్ని బట్టి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ నాని ఫోకస్ మెగా మూవీ మీద ఏ స్థాయిలో ఉందనేది తేటతెల్లం చేస్తోంది. ఇక మొదలవ్వడమే తరువాయి.

హిట్ 3 రిలీజయ్యాక ప్యారడైజ్ సెట్లలో అడుగు పెట్టబోతున్న నాని ఈ సంవత్సరంలో ఇవ్వబోయేది ఒక్క సినిమానే. మొన్నటిదాగా మూడు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకున్న న్యాచురల్ స్టార్ ఇప్పుడు పెరిగిన ప్యాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా అంత వేగంగా వెళ్లలేకపోతున్నాడు. హిట్ 3 వయొలెన్స్ పరంగా ఇప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారగా అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ది ప్యారడైజ్ ఇండియా వైడ్ టాపిక్ అయ్యింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకోకుండా క్రమంగా మాస్ అండ్ యాక్షన్ వైపు దృష్టి పెడుతున్న నాని వచ్చే సంవత్సరం చిరంజీవికి నిర్మాతగా మరో పెద్ద మెట్టు ఎక్కబోతున్నాడు.

This post was last modified on April 23, 2025 3:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

38 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago