విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న కింగ్ డమ్ విడుదల మే 30 అని గతంలోనే ప్రకటించారు. ఇంకో నలభై రోజులు మాత్రమే ఉండటంతో ఖచ్చితంగా ఆ డేట్ ని అందుకోలేదేమోననే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి వాయిదా పక్కా అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మాత్రం డెడ్ లైన్ మీటయ్యేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు వేగవంతం చేశారు. ఇటీవలే హీరో పార్ట్ మొదలై దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అసలు సమస్య అనిరుధ్ రవిచందర్ తో ఉంది. తనేమో బిజీగా ఉన్నాడు. రీ రికార్డింగ్ కి తగినంత సమయం ఇస్తేనే బెస్ట్ రాబట్టుకోవచ్చు. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే అవుట్ ఫుట్ తేడా కొడుతుంది. కమల్ హాసన్ ఇండియన్ 2, అజిత్ పట్టుదల దానికి ఉదాహరణ. అయితే అనిరుధ్ కు కింగ్ డమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని జెర్సీ నుంచే మంచి బాండింగ్ ఉంది. పైగా తెలుగులో సితార సంస్థకు అతనిచ్చే ప్రాధాన్యం ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకుంటే కనక బీజీఎమ్ కోసం క్వాలిటీ టైం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కింగ్ డమ్ కోసమే గౌతమ్ తిన్ననూరి తన మరో సినిమా మేజిక్ పోస్ట్ ప్రొడక్షన్ ఆపేశాడు.
సో కింగ్ డమ్ మాట మీద ఉంటేనే మంచిది. ఎందుకంటే జూన్ లో కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు కనక మేలో రాకపోతే అది కూడా జూన్ కు వెళ్తుంది. అప్పుడు ఓపెనింగ్స్ పరంగా కింగ్ డమ్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేం. పైగా అన్ని భాషల్లో విడుదల కాబట్టి సోలో డేట్ కోసం చాలా కసరత్తు చేసి మే 30 లాక్ చేసుకున్నారు. వదులుకుంటే చిక్కులు తప్పవు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రమోషన్ల కోసం ఓ రెండు వారాలు కేటాయించుకోవాలి. సో కింగ్ డమ్ టీమ్ కాళ్లకు చక్రాలు కాదు రాకెట్లు తగిలించుకుని మరీ పరుగులు పెట్టాల్సి ఉంటుంది.
This post was last modified on April 20, 2025 8:41 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…