పోటీ లేకుండా సోలో రిలీజ్ దక్కితేనే ప్యాన్ ఇండియా సినిమాలకు మంచి ఓపెనింగ్స్ తో పాటు క్లోజింగ్ ఫిగర్స్ బాగుంటాయి. అందుకే బాగా ఆలస్యమైనా సరే కుబేరకు జూన్ 20 లాక్ చేసుకున్నారు. ధనుష్, రష్మిక మందన్న జంటగా నాగార్జున ఒక కీలక పాత్ర పోషించిన ఈ మనీ క్రైమ్ డ్రామాను దర్శకుడు శేఖర్ కమ్ముల అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువ తీసుకున్నప్పటికీ క్వాలిటీ విషయం అస్సలు రాజీ పడలేదని ఇన్ సైడ్ టాక్. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్లు మొదలుపెట్టి ఫస్ట్ ఆడియో సింగల్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాట ప్రోమో ఇప్పటికే అంచనాలు పెంచింది.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ కుబేర వస్తున్న జూన్ 20నే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ విడుదలకు ప్లానింగ్ జరుగుతోందనే వార్త అక్కినేని ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే తెలుగు వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా హిందీ వెర్షన్ వల్ల మల్టీప్లెక్సుల కలెక్షన్లు ప్రభావితం చెందుతాయి. పైగా దీని మీద ప్రీ బజ్ చాలా పాజిటివ్ గా ఉంది. అజయ్ దేవగన్ రైడ్ 2 తో పాటు థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన సితారే జమీన్ పర్ కమర్షియల్ మూవీ కాకపోయినా కంటెంట్ పరంగా క్లాసు మాసు కనెక్ట్ అయ్యే అంశాలు బోలెడున్నాయి.
మరి ఈ క్లాష్ నిజంగా జరగనుండగా లేదానేది ఇంకో వారం రోజుల్లో తేలనుంది. నాగార్జునతో వ్యక్తిగతంగా ఎంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నా అమీర్ ఖాన్ ఈ ముఖాముఖీని ఆపడు. ఎందుకంటే గతంలో గదర్ కు పోటీగా లగాన్, ఘాయల్ కు కాంపిటీషన్ గా దిల్ ని దింపి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. పోటీలో ఉన్నవి కూడా సూపర్ హిట్ కావడం వేరే విషయం. ఒక బిచ్చగాడు కోట్లకు పడగెత్తే క్రమాన్ని ఒక డిఫరెంట్ సెటప్ లో చూపించబోతున్న శేఖర్ కమ్ముల కుబేరతో ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమే అనిపిస్తోంది. దేవి కంపోజ్ చేసిన పాటలు చాలా బాగా వచ్చాయని తెలిసింది. కమ్ముల అభిరుచి తెలిసిందేగా.
This post was last modified on April 17, 2025 7:59 pm
వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్కు ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…