2023 ఖుషి తర్వాత సమంతా దర్శనం మళ్ళీ జరగలేదు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి కొంత సమయం తీసుకుని నిర్మాతగా బిజీ అయిపోతోంది. చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూనే తను ప్రధాన పాత్ర పోషిస్తున్న మా ఇంటి బంగారంని వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం చూశాం. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికెలకు దర్శకత్వం అప్పజెప్పినప్పటికీ లాభం లేకపోయింది. ఫ్లాప్ గా నిలిచింది.
దీంతో సీజన్ 2 ని వద్దనుకుని ఆ మేరకు ప్రైమ్ నిర్ణయం తీసుకున్నట్టుగా ముంబై రిపోర్ట్. తడిసి మోపెడవుతున్న వ్యయంతో పాటు రిటర్న్స్ తక్కువగా ఉండటం వల్ల ఆపేయడమే మంచిదని డిసైడ్ అయ్యారట. అధికారిక ప్రకటన వస్తుందో రాదో కానీ మొత్తానికి ఆగడం మాత్రం పక్కానే. సిటాడెల్ కోసం సామ్ చాలా కష్టపడింది. స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చేసింది. దేశ విదేశాలు తిరిగింది. ప్రమోషన్లు చేసింది. ఇన్ని చేసినా రిజల్ట్ ఫ్లాప్ అయ్యింది. ఆమెకు జోడిగా చేసిన హీరో వరుణ్ ధావన్ కు సైతం ఈ రిజల్ట్ రుచించలేదు. ప్రియాంకా చోప్రా నటించిన ఇంగ్లీష్ వెర్షన్ సైతం సీక్వెల్ కి నోచుకోకపోవచ్చని ముంబై వర్గాల కథనం.
ఏది ఏమైనా కరోనా టైంలో లాగా వెబ్ సిరీస్ లకు ఇప్పుడు ఆదరణ దక్కడం లేదు. మంచి కంటెంట్లు సైతం యావరేజ్ గా నిలుస్తున్నాయి. అలాంటిది సిటాడెల్ జనాలకు నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. గంటల తరబడి ఏకబికిన చూసే ప్రేక్షకులు తగ్గిపోవడం ఒక ఎత్తయితే భాగాలుగా ఒక్కొకటి ఒక్కో రోజు ఓపిగ్గా చూసే ఆడియన్స్ లో సైతం గణనీయమైన తగ్గుదల ఉంది. సిటాడెల్ లో హంగులు ఎన్ని ఉన్నప్పటికే పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేసే కథా కథనాలు లేవు. అందులోనూ నెమ్మదిగా సాగడం మరో మైనస్. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్న సమంతా త్వరలోనే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది.
This post was last modified on April 17, 2025 8:54 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…