నేచురల్ స్టార్ నాని కెరీర్లో తొలి పదేళ్లు పక్కా క్లాస్ మూవీసే చేశాడు. అతడి ఫ్యాన్స్‌లో కూడా ఎక్కువగా క్లాస్ చిత్రాలను ఇష్టపడేవారే ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో నాని రూటు మారింది. ఎంసీఏ, నేను లోకల్ లాంటి చిత్రాల్లో హీరోయిజం ఎలివేట్ కావడంతో మాస్ ప్రేక్షకులకు అవి చేరువ అయ్యాయి. ‘దసరా’తో మాస్‌లో మాంచి ఫాలోయింగే సంపాదించాడు నాని. అయినా సరే తన మార్కు సినిమాలనేమీ అతను వదిలేయలేదు. ‘హాయ్ నాన్న’తో ఫ్యామిలీ ఆడియన్సుని అలరించాడు. ‘సరిపోదా శనివారం’తో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు తన నుంచి వస్తున్న ‘హిట్-3’ చాలా వయొలెంట్‌గా కనిపిస్తోంది.
నాని చిత్రాల్లో ఇంత వయొలెన్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఐతే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో నాని ఏమీ దాగుడుమూతలు ఆడట్లేదు. ‘హిట్-3’ విషయంలో తనను అభిమానించే క్లాస్ ప్రేక్షకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నాని స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. వైజాగ్‌లో ‘హిట్-3’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. ‘‘నాని యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునేవారంతా మే 1న థియేటర్లకు వచ్చేయండి.
నాని లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్, ఫన్ చిత్రాలు చేయాలని అనుకునేవారు మాత్రం ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాని అన్ని రకాల చిత్రాల్లో నటించాలని కోరుకునేవాళ్లు మా చిత్రాన్ని ఎంజాయ్ చేయండి’’ అని నాని పేర్కొన్నాడు. ‘హిట్-3’ టాలీవుడ్‌కు ఒక కొత్త జానర్‌ను పరిచయం చేయనుందని నాని చెప్పడం విశేషం. ఇక వైజాగ్ గురించి నాని మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్లనుంచి ఇక్కడికి వస్తున్నాం. మొదట్లో ఒక అమ్మాయిని కలవడానికి ఇక్కడికి వచ్చేవాడిని. తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నా. తర్వాత కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నా. వేరే ఊర్లకు వెళ్తే నన్ను ఒక అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ వైజాగ్ వాళ్లు మాత్రం నన్ను అల్లుడిగా చూస్తారు. అది నాకు స్పెషల్’’ అని నాని చెప్పాడు.
This post was last modified on April 14, 2025 4:37 pm
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…