Movie News

‘స్పిరిట్’ ఎప్పుడు – ఎక్కడ – ఎలా

ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా దర్శకులకు సూచనలు వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ రెండూ కంప్లీట్ అయితే తర్వాత  సందీప్ రెడ్డి వంగా సూచనల మేరకు కేవలం స్పిరిట్ మూవీకే డార్లింగ్ అంకితం కాబోతున్నట్టు తెలిసింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ పనులు దాదాపు కొలిక్కి వచ్చేశాయి. సందీప్ సాధారణంగా తీసుకునే సమయం కంటే స్పిరిట్ ఎక్కుడ డిమాండ్ చేసిందట. ప్రతిదీ పెర్ఫెక్ట్ అనిపించుకున్నాకే ఫైనల్ చేయడం అతని శైలి కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు.

ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు స్పిరిట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. దీని కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా బరువు తగ్గి ఫిజిక్ ని మార్చుకోబోతున్నాడు. రూత్ లెస్ (జాలి దయ లేని) పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబట్టి దానికి తగ్గ శరీరాకృతిని మలుచుకోబోతున్నట్టు చెబుతున్నారు. యుఎస్, కొరియా నుంచి ఎంపిక చేసిన యాక్టర్లు ఇందులో భాగం కాబోతున్నారు. విలన్ గా డాన్లీ పేరు వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. దీన్ని కేవలం ఇండియాలో మాత్రమే షూట్ చేయట్లేదు. వివిధ దేశాల్లో చిత్రీకరణ ఉంటుందని, ఊహించని మలుపులు అక్కడే ఉంటాయని అంటున్నారు.

2027 విడుదల టార్గెట్ గా పెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఒక ఏడాది పూర్తిగా షూట్ కే కేటాయించబోతున్నాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగినంత సమయం ఉంటుంది. యానిమల్ తర్వాత మూవీ కావడంతో బాలీవుడ్ సర్కిల్స్ లో దీని మీద విపరీతమైన డిమాండ్ ఉంది. నిర్మాణ సంస్థలు టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కి అప్పుడే ఆఫర్ల వర్షం మొదలయ్యిందట. ఓటిటి ఎంక్వయిరీలు సైతం కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్నాయని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా ఇవేవి ఫైనల్ చేసే మూడ్ లో లేడు. షూట్ మొదలయ్యాక ప్రోగ్రెస్ ని బట్టి ఎంత రేట్లు ఉండాలనేది డిసైడ్ చేయబోతున్నారట. సో లాంగ్ వెయిటింగ్ తప్పదు.

This post was last modified on April 12, 2025 6:47 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago