చెప్పిన డేటుకి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరిహర వీరమల్లు మే 9 విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న ఇరవై ఎనిమిది రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంట్ గా మార్చేయాలి.
ఇది మొదటి భాగమే కనక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్ కి హైప్ వస్తుంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికీ క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి.
నార్త్ బాలీవుడ్ సర్కిల్స్ లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. ఛావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంతమేరకు భాగమవుతారో చూడాలి. ముందు ఓజి జపంలో మునిగి తేలే అభిమానులను వీరమల్లు వైపు లాగాలి. సోషల్ మీడియాలో వాళ్లే పబ్లిసిటీకి మొదటి మెట్టు. ఆ తర్వాతే మిగిలినవి.
This post was last modified on April 11, 2025 12:39 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…