Movie News

ప్రభాస్‍కి హెడ్డేక్‍గా మారిన ఆ డెసిషన్స్

బాహుబలి తర్వాత తనకు ఎంతటి ఇమేజ్‍ వస్తుందనేది ప్రభాస్‍ ముందే అంచనా వేయలేకపోయాడు. ఒకవేళ వేసినట్టయితే ఖచ్చితంగా తన తదుపరి రెండు చిత్రాలను అనుభవం లేని యువ దర్శకులతో ప్లాన్‍ చేసుకుని వుండేవాడు కాదు. బాహుబలి హిట్టయ్యాక తన మాట మార్చుకుని వుండొచ్చు కానీ తనకోసం అంతకాలం ఎదురు చూసిన దర్శకులను చిన్నబుచ్చలేక ఆ మాటకు కట్టుబడిపోయాడు.

సాహోతో సుజీత్‍ చాలా తడబడ్డాడు. ప్రభాస్‍కి వున్న శిఖరమంతటి ఇమేజ్‍కి తగ్గ సినిమా తీయలేక చతికిలపడ్డాడు. అతనితో పాటే రాధాకృష్ణ కుమార్‍కి కూడా మాట ఇచ్చిన ప్రభాస్‍ ఇంకా ‘రాధే శ్యామ్‍’ పూర్తి చేయలేకపోయాడు. కరోనా బ్రేక్‍ తర్వాత షూటింగ్‍ సజావుగా సాగుతుందని అనుకుంటే మళ్లీ బ్రేక్‍ పడింది. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‍ చేయలేని పరిస్థితి వుండడంతో ఈ చిత్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలా అని నిర్మాతలు వర్రీ అవుతున్నారు.

ఎక్స్టీరియర్‍ షాట్స్ అన్నీ తీసేసుకుని వచ్చి మిగతాది ఇక్కడే సెట్స్లో చేద్దామని అనుకున్నారు కానీ అంతవరకు కూడా షూట్‍ చేయలేకపోయారు. బాహుబలి తర్వాత ఇద్దరు యువ దర్శకులతో సినిమాలు చేయాలనే ప్రభాస్‍ నిర్ణయం ఇప్పుడు తన ఫ్యూచర్‍ ప్లాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తోంది. రాధేశ్యామ్‍ ఆలస్యం అయ్యేకొద్దీ ఆది పురుష్‍తో పాటు నాగ్‍ అశ్విన్‍ సినిమా కూడా మరింత వెనక్కి వెళుతుంది.

This post was last modified on November 2, 2020 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

4 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

5 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

6 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

7 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

8 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

9 hours ago