Movie News

సిద్ధు మీద నిర్మాతకు కంప్లైంట్.. తీరా చూస్తే

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ‌కు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ చిత్రం మొదలైనపుడు, రిలీజవుతున్నపుడు పెద్దగా అంచనాలే లేవు. కానీ విడదుల తర్వాత అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. టిల్లు పాత్ర, సిద్ధు పెర్ఫామెన్స్ యువ ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. ఇక ‘టిల్లు స్క్వేర్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.

ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో నటుడిగానే కాక రైటర్‌గానూ సిద్ధు పాత్ర ఎంతో కీలకం. ఐతే ‘డీజే టిల్లు’ చేస్తుండగా చిత్రీకరణ మధ్యలో తాను దర్శకుడితో కలిసి డైలాగులను ఇంప్రొవైజ్ చేస్తుంటే.. మేనేజర్ అపార్థం చేసుకుని తన మీద నిర్మాత నాగవంశీకి కంప్లైంట్ చేసినట్లు సిద్ధు వెల్లడించాడు.

డీజే టిల్లు షూట్ జరుగుతుండగా.. నిర్మాత ఫోన్ చేసి ఏం చేస్తున్నావని సిద్ధు అడిగాడట. షూటింగ్‌లో ఉన్నామని చెబితే, మేనేేజర్ ఎందుకో ట్రిప్ అవుతున్నాడో చూసుకో అని చెప్పాడట సిద్ధు. షాట్ గ్యాప్‌లో తాను, దర్శకుడు విమల్ కృష్ణ పక్కకెళ్లి నవ్వుతూ కనిపించడంతో మేనేజర్.. తాము షూటింగ్ వదిలేసి జోకులేసుకుంటున్నామని మేనేజర్ భావించి నిర్మాతకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్లు సిద్ధు చెప్పాడు.

ఐతే వాస్తవం ఏంటంటే.. సినిమాలో హైలైట్ అయిన “నువ్వెళ్లి వాటర్ మెలాన్ ఆర్డర్ చేసుకుని చిల్ అవ్వు.. ఈ శవాలు పాతిపెట్టుడు నాకలవాటే” అనే డైలాగ్‌ను తాను విమల్‌కు చెప్పానని.. ఇలా డైలాగ్ చెబితే బాగుంటుంది కదా అంటే, అతను ఆ డైలాగ్‌కు నవ్వాడని సిద్ధు తెలిపాడు. నిజానికి జరిగింది ఇది అయితే.. తామిద్దరం షూట్ వదిలేసి జోకులేసుకుంటున్నామని మేనేజర్ అనుకున్నాడని.. ఇలా ఎవరి పర్సెప్షన్ వారికి ఉంటుందని.. వాస్తవంగా జరిగేది ఒకటని.. కాబట్టి దేని మీదా వెంటనే ఒక అంచనాకు వచ్చేయడకూడదని అన్నాడు సిద్ధు.

This post was last modified on April 8, 2025 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

24 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

52 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago