ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ 26 నాని, మార్చ్ 27 రామ్ చరణ్ రావడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఈ హోరాహోరీ జరగదు. అదెలాగో చూద్దాం. మొదటి పాయింట్ రెండు ప్యాన్ ఇండియా బడ్జెట్లే. ముఖ్యంగా నాని కెరీర్ లోనే అత్యధిక మొత్తం ప్యారడైజ్ మీద ఖర్చు పెడుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. పెద్ద ఎత్తున వేసిన సెట్లు సిద్ధంగా ఉన్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొలిక్కి తెచ్చేశాడు.
ఇక పెద్ది విషయానికి వస్తే బుచ్చిబాబు అనుకున్న దానికన్నా వేగంగా తీస్తున్నాడు. శివరాజ్ కుమార్ లాంటి కీలక ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ మళ్ళీ దొరికేవి కాకపోవడంతో ముందు ఆ ఎపిసోడ్లన్నీ కానిస్తున్నాడు. రెహమాన్ తో మూడు పాటలు ఓకే అయ్యాయి. మిగిలినవి కూడా రెడీ అవుతాయి. జాన్వీ కపూర్ అవసరం పడినప్పుడంతా కాల్ షీట్లు ఇచ్చి సహకరిస్తోంది. సో పెద్దికి బ్రేక్ పడేలా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్యారడైజ్ తో పోల్చుకుంటే పెద్ది చిత్రీకరణ రెండు మూడడుగులు ముందే ఉంది. అలాని సమస్య లేదని కాదు. స్టార్ హీరోల సినిమాలకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మార్కెట్, బిజినెస్ పరంగా చరణ్ తో నాని సమానం కాదు. అయినా సరే కంటెంట్ తో తలపడాలన్నా థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇది కాకుండా నాని నిర్మాతగా ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ బాండింగ్ దృష్ట్యా పెద్దిని కవ్వించడం ప్యారడైజ్ కు ఇబ్బందే. ముందు అనౌన్స్ చేసింది మేమే కదాని నాని అభిమానులు అనొచ్చు. అది నిజమే. కానీ ప్రాక్టికల్ కోణంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మాతలు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. సో పేపర్ మీద నాని వర్సెస్ చరణ్ కనిపిస్తోంది కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో దేనికైనా వేచి చూడాల్సిందే.
This post was last modified on April 6, 2025 5:33 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…