ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త జంటతో ఉప్పెన బ్లాక్ బస్టర్ తో పాటు జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బుచ్చిబాబు మీద అభిమానులు అంతులేని నమ్మకం పెట్టుకున్నారు. సుకుమార్ శిష్యుడు కావడంతో గురువు సహకారం, మార్గదర్శకత్వంలో రంగస్థలంని మించిన బొమ్మ ఇస్తాడని సోషల్ మీడియాలో తెగ ఎలివేషన్లు ఇస్తూ వచ్చారు. అనుకున్నట్టుగా పెద్ది టీజర్ తో బుచ్చిబాబు ధోని స్టైల్ లో హెలికాఫ్టర్ షాట్ కొట్టాడు. కథేమీ చెప్పకపోయినా రామ్ చరణ్ ని ప్రేక్షకులు ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేశాడు.
రంగస్థలం తరహా పల్లెటూరి వాతావరణం, దసరా టైపులో క్రికెట్ ఆట లాంటి కొన్ని పోలికలు కనిపిస్తున్నప్పటికీ చరణ్ స్వాగ్ తో వాటిని పూర్తిగా డామినేట్ చేసేలా ఒరిజినాలిటీ సృష్టించడంలో బుచ్చిబాబు విజయం సాధించాడు. అయితే కేవలం ఈ నిమిషం వీడియోని బట్టి పెద్ద పెద్ద తీర్పులు ఇవ్వలేం కానీ ఫస్ట్ షాట్ పేరుతో తను రాసిన మొదటి పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాడు. తర్వాత పెట్టుకోవాల్సిన టార్గెట్ డిస్టింక్షన్, అటుపై స్టేట్ ఫస్ట్, ఆ తర్వాత ఇండియా టాప్ వన్. ఎందుకంటే అంచనాల పరంగా బుచ్చిబాబు మీద బరువు పెరుగుతూ పోతుంది. దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్.
రిలీజ్ కి ఇంకా ఏడాది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు హడావిడిగా చేయాల్సింది ఏం లేదు కానీ ఏఆర్ రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం బుచ్చిబాబు ఎదురుకోబోయే మరో ఛాలెంజ్. టీజర్ వరకు కార్యం సాధించుకున్నాడు. ఇంతే మోతాదులో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చాయంటే అనిరుద్, దేవి, తమన్ పని చేయలేదనే లోటు తెలియకుండా పోతుంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల్లో రెహమాన్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా లేదు. అది పెద్దితో మారుతుందని మ్యూజిక్ లవర్స్ నమ్మకం. 2026 మార్చి 26 బోలెడు దూరం ఉంది కనక అప్పటిదాకా చాలా కబుర్లు, అప్డేట్లు తెలుస్తాయి. చూడాలి బుచ్చిబాబు ఇంకేం వండుతాడో.
This post was last modified on April 6, 2025 1:50 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…