ఎంత రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీ ఆలస్యమవుతుందని తెలిసినా అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు ఆపడం లేదు. వరుసగా పాత సినిమాల రీ రిలీజులను క్యూ కట్టిస్తూ సొమ్ములు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు ఎంత మంచి ఆదరణ దక్కిందో చూశాం. పన్నెండేళ్ల తర్వాత థియేటర్లకు వచ్చింది కాబట్టి జనం బాగానే చూశారు. వసూళ్లు భారీగా నమోదయ్యాయి. కానీ ‘ఒక్కడు’ ఇప్పటికే రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ ఏప్రిల్ 26 ఇంకోసారి చూడమంటూ ప్రకటనలు వదిలారు. ఏకంగా ట్రెండింగ్ లోకి తెచ్చేశారు.
ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన గంటల్లోనే ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 19 పునః విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ వచ్చేసింది. జూన్ లేదా జూలైలో ‘అతిథి’ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇలా బ్లాక్ బస్టర్లన్నీ ఒకేసారి పిండేసుకుంటే తర్వాత చూసుకోవడానికి ఏముండవు. అసలే మహేష్ నటించింది కేవలం 28 సినిమాలు. వాటిలో బాబీ, నాని, స్పైడర్, వంశీ లాంటివి ఉపయోగపడవు. ఎంతసేపు యావరేజ్ లేదా సూపర్ హిట్లను వాడుకోవాల్సిందే. ఇప్పుడదే జరుగుతోంది.
నిజానికి ఈ ధోరణికి కాస్తంత బ్రేక్ వేయాలి. వీటి వల్ల కొత్త సినిమాల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి. పోనీ పాత చిత్రాలను ఏమైనా తగ్గింపు టికెట్ రేట్లతో ప్రదర్శిస్తున్నారా అంటే అదీ లేదు. రెగ్యులర్ ధరలే ఉంటున్నాయి. వీటిని చూస్తున్న జనాలు పెద్దగా టాక్ రాని లేటెస్ట్ రిలీజులను లైట్ తీసుకుంటున్నారు. అయినా అన్నీ 2025లోనే జరిగిపోవాలనే తరహాలో ఇన్నేసి రీ రిలీజులు మూకుమ్మడిగా రావడం సరైంది కాదు. అయినా ఇవి ఒకరు చెబితే వినేవి కాదు కానీ అభిమానులు తమంత తాముగా ప్రెస్టీజ్ కు వెళ్ళకుండా రికార్డుల కోసం రీ రిలీజులను చూడటం తగ్గిస్తే క్రమంగా ఈ తాకిడి నెమ్మదించి తర్వాత గాడిలో పడుతుంది.
This post was last modified on April 4, 2025 5:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…