ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్. ఒక సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ముందే గుర్తిస్తున్న దర్శకులు దానికి అనుగుణంగా పార్ట్ 2 అంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కు మరో రెండు భాగాలు కొనసాగింపు ఉంటుందట. జాక్ ప్రో, జాక్ ప్రో మ్యాక్స్ పేరుతో కథలు కూడా రాసి పెట్టుకున్నారట. ఇప్పుడొచ్చే బాక్సాఫీస్ రిజల్ట్ ని బట్టి నిర్ణయం తీసుకుంటామనే తరహాలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హింట్ ఇవ్వడం గమనార్షం. సిద్ధూ సైతం రెడీగా ఉన్నాననే సంకేతం ఇచ్చాడు కానీ ఎంతమేరకు ఇది సాధ్యమవుతుందనేది తెలియాలంటే వారం ఆగాలి.
నిజానికి జాక్ మీద విపరీతమైన హైప్ లేదు. ట్రైలర్ కట్ బాగానే ఉన్నప్పటికీ బూతులు జొప్పించడం పట్ల అప్పుడే కామెంట్లు మొదలైపోయాయి. దానికి సమాధానంగా సిద్ధూ వెర్షన్ ఏదైనా భాస్కర్ ఎప్పుడూ ట్రై చేయని ఇలాంటి ఎలిమెంట్స్ ట్రెండ్ అనుకోవాలో లేక ఇంకేమైనానో ఆయనకే తెలియాలి. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడం ఎంత వరకు ప్లస్ అవుతుందనేది థియేటర్ లో సినిమా చూశాక కాని కంక్లూజన్ కు రాలేం. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ టైంలో చూపించిన ప్రమోషన్ల జోరు జాక్ కు ఫాలో కావడం కష్టంగా ఉంది. చేతిలో టైం తక్కువగా ఉండటంతో పరిమితంగా చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద జాక్ కు తెలుగులో ఎలాంటి పోటీ లేదు కానీ తమిళం నుంచి వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ రూపంలో అజిత్, సన్నీడియోల్ లు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. సిద్ధూకి జాక్ హిట్ అయితే కలిగే ప్రధాన ప్రయోజనం ఒకటుంది. తాను టిల్లు తరహా ఎంటర్ టైన్మెంట్ కంటెంట్ కే కాదు సీరియస్ జానర్ లోనూ ఫిట్ అవుతానని నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు జరుపుకుంటున్న జాక్ ని ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు. టాక్ పాజిటివ్ వస్తే సిద్ధూ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయొచ్చు. చూడాలి.