తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం.. ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించే కాన్సెప్ట్‌తో 34 ఏళ్ల కిందటే సినిమా తీసి అబ్బురపరిచింది సింగీతం శ్రీనివాసరావు బృందం. ఈ ఆల్ టైం క్లాసిక్ ఈ శుక్రవారం పెద్ద ఎత్తున రీ రిలీజ్ కాబోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో దీనికి టీం ప్రమోషన్లు చేస్తోంది. మొన్న నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తాజాగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సైతం మీడియాను కలిశారు. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐతే దీని కంటే ముందే ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘ఆదిత్య 369’కు నాసా సైంటిస్టుల ప్రశంసలు దక్కిన విషయాన్ని పంచుకోవడం విశేషం.
ఆదిత్య 369 తీసిన సమయానికి అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద టైం మెషీన్ నేపథ్యంలో సినిమానే రాలేదని.. అయినా ఇండియాలో ఈ తరహా చిత్రం తొలిసారి తీసినప్పటికీ పర్ఫెక్షన్ ఉండేలా చూసుకున్నామని సింగీతం తెలిపారు. నాసాలో పని చేసే తెలుగు, ఇండియన్ సైంటిస్టులకు ఈ సినిమా గురించి తెలిసి ముచ్చటపడి.. తమ బృందానికి ఈ సినిమా చూపించారని.. వాళ్లందరికీ ఈ సినిమా చాలా నచ్చి తమతో మాట్లాడారని సింగీతం తెలిపారు. అప్పటికే వరల్డ్ సినిమాలో టైం మెషీన్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయని.. ఐతే వాటన్నింటిలో ఇదే పర్ఫెక్ట్‌గా ఉందని కితాబిచ్చారని సింగీతం చెప్పారు. కాలంలో ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని.. ఈ విషయాన్ని టైం మెషీన్ పని చేయడం మొదలుపెట్టి హీరో హీరోయిన్లు అందులో ప్రయాణం మొదలుపెట్టే సన్నివేశం చూసి నాసా సైంటిస్టులు ఎంతగానో అభినందించారని సింగీతం తెలిపారు.
ఇక తాజా ఇంటర్వ్యూలో సింగీతం మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని ఎంతో ప్రయత్నించామని.. స్క్రిప్టు కూడా రెడీ చేశామని.. కానీ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదని అన్నారు. ఈ సీక్వెల్‌తో తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలయ్య భావించారని.. ఆలస్యం అయినప్పటికీ బాలయ్య ఈ సినిమా చేయాలనే అనుకుంటున్నారని సింగీతం తెలిపారు. ‘ఆదిత్య 369’ తీయాలనుకున్నపుడు తనకు బాలయ్య తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని.. విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఆమెకు కుదురకపోవడంతో మోహినిని తీసుకున్నామని.. తాను కాలేజీ రోజుల్లో చదివిని ‘ది టైం మెషీన్’ అనే నవల ఈ సినిమాకు స్ఫూర్తి అని సింగీతం వెల్లడించారు.
This post was last modified on April 3, 2025 2:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…