రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందుతున్న పెద్ది ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై అంచనాలకు కావాల్సిన మొదటి పునాది బలంగానే వేసింది. లుక్స్ పరంగా పుష్ప, రంగస్థలంతో పోలిక వచ్చినప్పటికి ఫ్యాన్స్ కోరుకున్న రీతిలోనే ఉండటంతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇదిలా ఉండగా పెద్ది ఆడియో రైట్స్ టి సిరీస్ సంస్థ 25 కోట్లకు సొంతం చేసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారనుంది. ఇక్కడ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ బ్రాండ్ తో పాటు చరణ్ మార్కెట్ వేల్యూ ఇంత మొత్తాన్ని వచ్చేలా చేసింది. గేమ్ ఛేంజర్ ప్రభావంతో సంబంధం లేకుండా ఇంత రేట్ పలకడం విశేషమే.
నిజానికి ఏఆర్ రెహమాన్ ఆయన స్థాయి ఫామ్ చూపించి సంవత్సరాలు గడిచిపోయాయి. క్రమం తప్పకుండా సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పటి ప్రేమికుడు, బొంబాయి, భారతీయుడు మేజిక్ మిస్సవుతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కానీ బుచ్చిబాబు దగ్గరుండి మరీ బెస్ట్ సాంగ్స్ చేయించుకున్నాడనే టాక్ మెగా కాంపౌండ్ లో ఉంది. సహజంగా తానిచ్చిన ట్యూన్ ని మార్చడానికి ఒప్పుకోని రెహమాన్ పెద్ది కథ డిమాండ్, దర్శకుడి విన్నపం మేరకు మార్పులకు సైతం ఎస్ చెప్పారట. టీజర్ వీడియోకే రెండు మూడు సార్లు వర్క్ చేశారంటే పెద్ది మీద ఏ స్థాయిలో పని జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఏప్రిల్ 8 పెద్ది నుంచి చిన్న టీజర్ రానుంది. ఒక షాట్ కోసం వెయ్యిసార్లు చూస్తారని నిర్మాత రవిశంకర్ ఊరించడం అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతోంది. సినిమా విడుదల ఎప్పుడనేది చెప్పకపోయినా హైప్ పరంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటిదాకా మూడు పాటల రికార్డింగ్ పూర్తి చేసుకున్న పెద్దిలో ఇంకో రెండు ఉన్నాయట. జిగేల్ రాణి తరహాలో ఒక మాస్ నెంబర్ కూడా ఉందని వినికిడి. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ రేట్ లేని ఏఆర్ రెహమాన్ ఇప్పుడు పెద్ది రూపంలో రామ్ చరణ్ కు ఎలాంటి ఆల్బమ్, బిజీఎం ఇస్తారోరని మూవీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
This post was last modified on April 2, 2025 11:35 am
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……
గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…
https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…