రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రం మీద ఆశలు కూడా ఎక్కువే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ రెండు చిన్న షెడ్యూల్స్ షూట్ కూడా జరిగింది. ఐతే చరణ్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరేమో చరణ్ లుక్ సూపరన్నారు. కానీ ఎక్కువమంది పెదవి విరిచారు.
‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. చరణ్‌కు బుచ్చిబాబు సరైన మేకోవర్ ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ గాయానికి టీజర్ గ్లింప్స్‌తో మందు వేయాలని టీం భావిస్తోంది. నిజానికి చరణ్ పుట్టిన రోజుకే గ్లింప్స్ రిలీజ్ కావాల్సింది. కానీ సమయానికి మిక్సింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యవహారం తెలిసిందే. ఆయన అన్నీ లేట్ చేస్తాడు. గ్లింప్స్‌కు కూడా సమయానికి మ్యూజిక్ చేయలేదు.
ఐతే దర్శకుడు బుచ్చిబాబు ఆయన్ని కొంచెం ఫోర్స్ చేసి నాలుగు రోజుల గ్యాప్‌లోనే గ్లింప్స్ రెడీ చేయిస్తున్నాడు. ఆదివారం ఉగాది కానుకగా ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజవుతుంది. దాని నిడివి 20 సెకన్లే అని సమాచారం. కానీ లెంగ్త్ తక్కువ అయినప్పటికీ ఇంపాక్ట్ మాత్రం బలంగానే ఉంటుందని సమాచారం. ఫస్ట్ లుక్స్ రిలీజైనపుడు వచ్చిన నెగెటివిటీ అంతా కొట్టుకుపోయేలా ఈ గ్లింప్స్ ఉంటుందని.. ఆ రోజు సోషల్ మీడియా ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 28, 2025 7:08 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…