మార్చి 28 విడుదల కాబోతున్న మ్యాడ్ స్క్వేర్ బృందం అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పాటలు ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో కాకుండా ఈ బాధ్యతను వేరొకరికి ఎందుకు ఇచ్చినట్టు. ఇన్ సైడ్ టాక్ అయితే చిరు – రావిపూడి ప్రాజెక్టు సిట్టింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే భీమ్స్ దీనికి తగినంత సమయం కేటాయించలేదని అంటున్నారు. కానీ మంచి బిజిఎం వల్ల మరింత ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు జరిగిందని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
కారణం ఏదైనా ఇలా వేరొకరి పాటలు కంపోజ్ చేసిన సినిమాకు తమన్ బిజిఎం ఇవ్వడం ఇది మొదటి సారి కాదు. గతంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లుకి తమనే నేపధ్య సంగీతం సమకూర్చాడు. ఆ తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ కి పని చేశాడు. పుష్ప 2 కి వర్క్ చేయడం జరిగింది కానీ తర్వాత ఎందుకనో దేవి, సామ్ లతో సరిపెట్టారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కి వర్క్ చేయడం ఖచ్చితంగా అవుట్ ఫుట్ కి హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పటిదాకా ఈ విషయాన్ని గుట్టుగా ఉంచిన టీమ్ ఇవాళ హఠాత్తుగా అనౌన్స్ చేయడం విశేషం. తమన్ ఒప్పుకోవడానికి మరో నేపథ్యం ఉంది.
సితార & హారిక హాసిని, తమన్ కాంబోలో మంచి ఆడియోస్ ఉన్నాయి. భీమ్లా నాయక్, డాకు మహారాజ్, అల వైకుంఠపురములో, గుంటూరు కారం ఇలా వీళ్ళ కొలాబరేషన్ ఏళ్ళ తరబడి సాగుతోంది. అందుకే నాగవంశీ అడగ్గానే తమన్ ఎస్ చెప్పి ఉంటాడు. నితిన్ నార్నె, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ ఉండదు. ప్రియాంకా జవల్కర్ తో స్పెషల్ సాంగ్ పెట్టారు. మొత్తం ఈ ముగ్గురు చుట్టే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథను రాసుకున్నాడు. పోటీ ఎంత ఉన్నప్పటికీ మొదటి భాగంలాగే గట్టిగా హిట్టు కొడతామనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.